బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తెలంగాణ ఎన్నికల్లో హ్యాట్రిక్ పై కన్నేశారు. ప్రచారంలో హోరెత్తిస్తున్నారు. కానీ ఎన్నికల తేదీ దగ్గరపడుతున్నా కొద్దీ కేసీఆర్ లో ఆందోళన పెరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గెలుపుపై సందేహాలు పెరుగుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా తమ దారికి కాంగ్రెస్ అడ్డు వస్తుందనే కేసీఆర్ భావిస్తున్నట్లు తెలిసింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి కేసీఆర్ భయపడుతున్నారా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. అందుకే రేవంత్ ను కట్టడి చేయడంపై కేసీఆర్ ఫోకస్ పెట్టారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ పై ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ గా మారింది.
తాజాగా రేవంత్ పై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. ఎన్నికల్లో హింసను ప్రేరేపించేలా, కాంగ్రెస్ కార్యకర్తలను రెచ్చగొట్టి దాడులకు ఉసిగొల్పేలా రేవంత్ వ్యాఖ్యలు ఉంటున్నాయని బీఆర్ఎస్ పేర్కొంది. రేవంత్ ను స్టార్ క్యాంపెయినర్ గా ప్రచారంలో పాల్గొనకుండా కట్టడి చేయాలని, తెలంగాణను హింసాత్మకంగా మార్చడానికి కాంగ్రెస్ కుట్రలు పన్నుతోందని బీఆర్ఎస్ తెలిపింది. గత నెల 30న దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కాంగ్రెస్ కార్యకర్త కత్తితో దాడి చేశారని, ఈ నెల 11న అచ్చంపేట బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజుపై కాంగ్రెస్ అభ్యర్థి వంశీ క్రిష్ణ దాడి చేసి గాయపర్చారని బీఆర్ఎస్ ఆ ఫిర్యాదులో పేర్కొంది.
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ తనదైన దూకుడుతో దూసుకెళ్తోంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి పార్టీని పరుగులు పెట్టిస్తున్నారు. వరుసగా రెండు సార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పట్ల ప్రజల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకునేలా రేవంత్ వ్యూహాలు అమలు చేస్తున్నారు. కాంగ్రెస్ కు సానుకూలంగా ఏర్పడుతున్న పరిస్థితులను ఓట్లుగా మార్చుకునేందుకు రేవంత్ సాగుతున్నారు. ఆ దిశగా బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో పార్టీని గెలిపించే బాధ్యతను భుజాలకెత్తుకున్నారు. ప్రచారంలో జోరు ప్రదర్శిస్తూ బీఆర్ఎస్ కు కొరకరాని కొయ్యగా మారారు. దీంతో రేవంత్ కు అడ్డుకట్ట వేసేందుకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది.
This post was last modified on November 14, 2023 7:57 pm
ప్రస్తుతం మనలో చాలామంది తెలిసో తెలియకో ఇబ్బంది పడే సమస్యలలో యూరిక్ యాసిడ్ పెరుగుదల కూడా ఒకటి. చలికాలంలో ఈ…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…