తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఇప్పటికే బీఆర్ ఎస్ పై సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ప్రచారాన్నిముమ్మరం చేసింది. మరోవైపు.. బీజేపీకి బీఆర్ ఎస్ బీ
టీం అంటూ ప్రచారం కూడా చేస్తోంది. అందుకే తమప్రచారాల్లో ఎక్కడా బీజేపీని కానీ, ప్రధాని నరేంద్ర మోడీని కానీ బీఆర్ ఎస్ నేతలు విమర్శించడం లేదని కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇక, ఎంఐఎం, బీఆర్ ఎస్‌లను బీజేపీ అగ్రనేతలే ఆడిస్తున్నారంటూ..ఇటీవల పెద్ద ఎత్తున కటౌట్లు పెట్టి మరీ ఎన్నికల ప్రచారంలో వేడి రగిలించారు. ఇదిలావుంటే.. తాజాగా కాంగ్రెస్ నేతలు మరో సంచలన విషయాన్ని కూడా బయట పెట్టారు. బీజేపీ అగ్రనేత, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సీఎం కేసీఆర్ తనయ కవిత దిగిన సెల్ఫీలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే.. ఇవి ఎప్పుడు దిగారనేది మాత్రం తెలియాల్సి ఉంది.
కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం ఈ సెల్ఫీ ఫొటోలను విస్తృతంగా ప్రచారంలోకి తెచ్చింది. దీనిలో ప్రధాని నరేంద్రమోడీకి పక్కనే కవిత నిలబడిఉన్నారు. అదేవిధంగా పలువురు బీఆర్ ఎస్ నాయకులు కూడా ఈ ఫొటోలో కనిపిస్తున్నారు. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టిన కాంగ్రెస్ నాయకులు.. ఇది కదా బంధమంటే
అని వ్యాఖ్యానించారు. ఎన్నికల సంరంభానికి ముందు నుంచి బీజేపీకి-బీఆర్ ఎస్‌కు మధ్య బంధం ఉందనే ప్రచారం చేస్తున్న కాంగ్రెస్‌కు ఇప్పుడు సెల్ఫీలు అందివచ్చిన వరంగా మారాయని అంటున్నారు పరిశీలకులు. మరి వీటిపై బీఆర్ ఎస్ నాయకులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
This post was last modified on November 14, 2023 7:19 pm
ప్రస్తుతం మనలో చాలామంది తెలిసో తెలియకో ఇబ్బంది పడే సమస్యలలో యూరిక్ యాసిడ్ పెరుగుదల కూడా ఒకటి. చలికాలంలో ఈ…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…