Political News

జనాగ్రహం ఎవరిపైన ?

ఇపుడీ విషయమే అధికార బీఆర్ఎస్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రచారానికి వెళుతున్న అభ్యర్ధులను కొన్ని నియోజకవర్గాల్లో తమ గ్రామాల్లోకి రావద్దని జనాలు అడ్డుకుంటున్నారు. కొన్ని గ్రామాల్లో బీఆర్ఎస్ అభ్యర్ధులు అడుగుపెట్టవద్దని పోస్టర్లు, హోర్డింగులు కూడా పెట్టేస్తున్నారు. ఓట్లడగటానికి కాదు కదా చివరకు ర్యాలీలు, రోడ్డుషోలకు కూడా జనాలు ఒప్పుకోవటం లేదు. ఒకవైపు కేసీఆర్ బహిరంగ సభల పేరుతో రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. 18 రోజుల్లో 43 నియోజకవర్గాల్లో మొదటి విడత ప్రచారం చేశారు.

ఇంకోవైపు అభ్యర్ధులకు, నియోజకవర్గాల ఇన్చార్జిలకు, ద్వితీయ శ్రేణి నేతలకు సమన్వయం కుదరటంలేదు. నేతల మధ్య విభేదాలను సర్దుబాటు చేయాలని మంత్రులు కేటీయార్, హరీష్ రావులు ప్రయత్నిస్తున్నా సాధ్యంకావటంలేదు. కామారెడ్డి నేతల్లోని విభేదాలపై స్వయంగా కేసీయారే మండిపోయారంటే పరిస్ధితి ఎలాగుందో అర్ధమవుతోంది. స్వయంగా కేసీయార్ పోటీచేస్తున్నా కామారెడ్డి నేతలు ఏకతాటిపైకి రాలేదంటే అర్ధమేంటి ? ఇలాంటి అనేక ఘటనలతోనే జనాల ఆగ్రహం అసలు ఎవరిపైన అన్న విషయమే అర్ధంకావటంలేదు.

జనాగ్రహమంతా కేసీయార్ పైన లేకపోతే మంత్రులపైనా అదీ కాదంటే అభ్యర్ధులపైనా అన్న విషయంలోనే క్లారిటి రావటంలేదు. కాంగ్రెస్ నేతలేమో కేసీయార్+అభ్యర్ధులపైన జనాల్లో వ్యతిరేకత పెరిగిపోయిందని పదేపదే చెబుతున్నారు. బహిరంగసభల్లో కేసీయార్ మాట్లాడుతున్నారన్నమాటే కానీ స్వచ్చంధంగా జనాల్లో స్పందన ఆశించినంత కనబడటంలేదని సమాచారం. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వాగ్ధాటితో, బహిరంగసభలకు హాజరవుతున్న జనాల స్పందనతో పోల్చితే కేసీయార్ సభలు తేలిపోతున్నాయి. ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టడమే బీఆర్ఎస్ ఓడిపోతే హ్యాపీగా రెస్టు తీసుకుంటానని కేసీయార్ చెప్పటంతోనే రాంగ్ రూట్లో మొదలైంది.

తర్వాత ఇదే విషయాన్ని రెండు మూడు చోట్ల కేటీయార్ కూడా చెప్పారు. హరీష్ రావు మాట్లాడుతు ప్రభుత్వంలో తప్పులుంటే అధికారంలోకి రాగానే సరిచేసుకుంటామని చెప్పటం బాగా నెగిటివ్ అయ్యింది. తప్పులుంటే సరిచేసుకుంటామని ఇపుడు చెప్పటం ఏమిటి ? పదేళ్ళుగా అధికారంలో ఉన్నది బీఆర్ఎస్సే కదాని జనాలు ఆశ్చర్యపోతున్నారు. అంటే వీళ్ళ మాటల్లోనే అర్ధమైపోతోంది ఓటమి భయం. జనాల్లో కనబడుతున్న వ్యతిరేకతకు తోడు వీళ్ళ భయం మాటలే పార్టీని దెబ్బ తీస్తుందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. చివరకు జనాల తీర్పు ఎలాగుంటుందో చూడాలి.

This post was last modified on November 15, 2023 8:14 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అల్లు అర్జున్ కు మరోసారి లీగల్ నోటీసులు!

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…

4 hours ago

అవసరమైతే విదేశీ డాక్టర్లతో రేవతి కుమారుడు శ్రీతేజ్ కు వైద్యం!

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…

5 hours ago

కరోనా వేళ ప్రభాస్‌తో డైరెక్టర్ శంకర్ చర్చలు!

తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…

6 hours ago

పార్ట్ 2 మంత్రం పని చేయలేనట్టేనా…?

విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…

7 hours ago

వైల్డ్ ఫైర్ ఎఫెక్ట్ : ఆంధ్ర వైపు సంక్రాంతి సినిమాల చూపు!

పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…

8 hours ago

ఉదయం 4 గంటలకు డాకు మహారాజ్ షోలు : సాధ్యమేనా?

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…

8 hours ago