Political News

కేటీఆర్ సమక్షంలో కారెక్కిన తుల ఉమ

వేములవాడ బీజేపీ అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడ్డ మహిళా నేత తుల ఉమ ఈ రోజు మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. తుల ఉమకు కేటీఆర్ ఫోన్ చేసి బీఆర్ఎస్ లోకి సాదరంగా ఆహ్వానించగా..ఆ ఆహ్వానాన్ని మన్నించిన ఆమె ఈ రోజు పార్టీలో చేరారు. తన అనుచరులతో కేటీఆర్ సమక్షంలో తుల ఉమా బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. తుల ఉమ పట్ల బీజేపీ తీరు మహిళలు, బీసీల పట్ల ఆ పార్టీ వైఖరికి నిదర్శనమని కేటీఆర్ విమర్శలు గుప్పించారు. గతంలో హోదాకు మించి ఆమెకు సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

తెలంగాణ ఉద్యమంలో తుల ఉమ పాల్గొన్నారని గుర్తు చేశారు. కేసీఆర్ సూచన ప్రకారమే తుల ఉమకు తాను స్వయంగా ఫోన్ చేసి పార్టీలోకి ఆహ్వానించానని కేటీఆర్ చెప్పారు. అయితే, తన ఆహ్వానాన్ని మన్నించి ఆమె పార్టీలోకి రావడం సంతోషాన్నిచ్చిందని చెప్పారు. వేములవాడ అభివృద్ధితోపాటు రాష్ట్రంలోని మహిళల అభ్యున్నతి కోసం ఆమె సేవలు అవసరమని కేటీఆర్ అన్నారు.

ఇక, బీజేపీ తనకు టికెట్ ఇచ్చినట్లే ఇచ్చి దొడ్డిదారిన మరొకరికి ఆ టికెట్ కేటాయించిందని తుల ఉమ ఆరోపించారు. బీసీని ముఖ్యమంత్రిని చేస్తానన్న బిజెపి మాటలు ఒట్టివేనని విమర్శించారు. అందుకు తానే ఉదాహరణ అని, తనకు చెప్పింది ఒకటి చేసింది ఇంకొకటి అని ఆరోపించారు. బీఆర్ఎస్ లో తాను మొదటి నుంచి ఉన్నానని, ఇక్కడ ఇచ్చిన గౌరవం బిజెపిలో దొరకలేదని చెప్పారు.

కాగా, వైఎస్సార్టీపీ నేతలు గట్టు రామచంద్రరావుతో పాటు సత్యవతి ఆధ్వర్యంలో పలువురు నేతలు, వైటీపీ నేతలు, కోఆర్డినేటర్లు మంత్రి హరీష్ రావు సమక్షంలో బి ఆర్ ఎస్ లో చేరారు. వారందరికీ మంత్రి హరీష్ రావు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ శాసనసభ ఎన్నికలలో వైఎస్ఆర్ టిపి పోటీ చేయడం లేదని, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నామని ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ప్రకటనపై ఆ పార్టీ నేతలు గట్టు రామచంద్రరావుతో పాటు పలువురు నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలు ఆమెకు పార్టీలో సభ్యత్వం లేదని, ఆ పార్టీ తమదని చెప్పారు. అయితే, బీఆర్ఎస్ లో వైటీపీ విలీనంపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

This post was last modified on November 14, 2023 8:21 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అక్కినేని బయోపిక్ మీద ప్రాక్టికల్ కోణం

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచం నలువైపులా విస్తరింపజేసిన లెజెండ్స్ జీవితాలను తెరమీద చూపించే ప్రయత్నం మహానటితో మొదలయ్యింది. అది సాధించిన…

12 mins ago

ప్రశాంత్ వర్మకు మొదటి షాక్ తగిలింది

నిన్న విడుదలైన సినిమాల్లో బలహీనమైన టాక్ వచ్చింది దేవకీనందన వాసుదేవకే. హీరో తర్వాత అశోక్ గల్లా చాలా గ్యాప్ తీసుకుని…

1 hour ago

జమిలి వచ్చినా.. ఏపీలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు

అందరి మనసులని తొలిచేస్తున్న కొన్ని అంశాలపై పక్కా క్లారిటీ ఇచ్చేశారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వచ్చే సార్వత్రిక…

1 hour ago

బాలీవుడ్ బేబీకి హీరో దొరికాడు

ఊహించని స్థాయిలో భారీ వసూళ్లతో గత ఏడాది బాక్సాఫీస్ కొల్లగొట్టిన బేబీ హిందీ రీమేక్ కు రంగం సిద్ధమవుతోంది. హీరోగా…

1 hour ago

ఆంధ్రోడి సగటు అప్పు లెక్క కట్టిన కాగ్

పాలు తాగే పసికందు నుంచి పండు ముసలి వరకు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాష్ట్ర జనాభా మీద ఉన్న అప్పు భారం…

2 hours ago