తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకొన్నానమని, కాంగ్రెస్ గెలుపు కోసం ప్రయత్నిస్తామని, ప్రచారం చేస్తామని చెప్పిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు.. వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ నేతల నుంచి ఎక్కడా గ్రీన్ సిగ్నల్ కనిపించలేదు. ఆమె ఊసు, ధ్యాస కూడా ఎక్కడా వినిపించడం లేదు. “కేసీఆర్ ను ఓడించడమే లక్ష్యం. అందుకే త్యాగాలు చేస్తున్నాం. పోటీకి దూరంగా ఉంటున్నాం. మేం పోటీ చేస్తే.. ఓట్లు చీలిపోయి.. మరోసారి కేసీఆర్ విజయం దక్కించుకుంటారు. అందుకే దూరంగా ఉండాలని నిర్ణయించాం” అని షర్మిల ఇటీవల ప్రకటించారు.
ముఖ్యంగా పాలేరు నుంచి ఆమె పోటీ చేయాలని భావించిన విషయం తెలిసిందే. అక్కడ కూడా పోటీ చేయడం లేదని.. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటిని ఓడించడం తనకు ఇష్టం లేదని కూడా చెప్పుకొచ్చారు. అయితే.. ఇంతగా కాంగ్రెస్ కోసం ఆమె త్యాగాలు చేసినా.. ఆ పార్టీ మాత్రం ఇప్పటి వరకు షర్మిలను పట్టించుకోలేదు. కనీసం ప్రచారానికి రమ్మని కానీ.. పార్టీ తరఫున దంచి కొట్టమని కానీ.. పిలుపు అందలేదు.
మరి కాంగ్రెస్‌వ్యూహం ఏంటి? షర్మిల త్యాగాలు వృథా కావాల్సిందేనా? అనే చర్చ వైఎస్సార్ తెలంగాణ పార్టీలో వినిపిస్తున్నాయి. ఇప్పటికే పోటీ నుంచి పార్టీ విరమించుకోవడంతో ఆ పార్టీ నేతలు.. దూరమయ్యారు. లోపాయి కారీగా ఈ పార్టీ నాయకులు బీఆర్ఎస్‌కు మద్దతిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే.. ఇలా పార్టీలైన్‌ను దాటడంపైనా షర్మిల కార్యాలయం నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు. దీంతో షర్మిల త్యాగాలు.. ఎవరూ పట్టించుకోవడం లేదనే టాక్ ఉంది.
అయితే.. కాంగ్రెస్ నేతల మధ్య జరుగుతున్నచర్చ మరోవిధంగా ఉంది. షర్మిల మద్దతు కోరితే.. బీఆర్ ఎస్‌కు అవకాశం ఇచ్చినట్టు అవుతుందని.. షర్మిలను ఇప్పటికీ ఏపీకి చెందిన కుటుంబంగానే తెలంగాణ సమాజం భావిస్తోందని.. పైగా ఆమెకు ఓటు బ్యాంకు ఎక్కడా లేదని.. ఇప్పుడు ఆమె ఆహ్వానించి… ప్రచారానికి అవకాశం ఇస్తే.. చేజేతులా నష్టపోతామని కూడా.. నాయకులు గుసగుసలాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే షర్మిలను ఎవరూ పట్టించుకోవడం లేదని అంటున్నారు.
This post was last modified on November 14, 2023 6:35 am
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…