కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల్లో ఒకరైన రాహుల్ గాంధి అడ్రస్ లేరని నేతలు, క్యాడర్ తెగ ఫీలైపోతున్నారట. తెలంగాణాకు ఇన్నిసార్లు వచ్చినా ఇంకా రాలేదని ఎలాగ అంటారని అనుంటున్నారా ? తెలంగాణాలో రాహుల్ పర్యటించింది, బహిరంగసభల్లో పాల్గొంటున్నది నిజమే. కానీ అడ్రస్ లేనిది రాజస్ధాన్ లో. ఎన్నికలు జరగబోయే ఐదు రాష్ట్రాల్లో తెలంగాణా, చత్తీస్ ఘర్, మధ్యప్రదేశ్, మిజోరంతో పాటు రాజస్ధాన్ కూడా ఉంది. అధికారం కోసం కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ హోరాహోరీగా జరుగుతోంది.
రెండుపార్టీల మధ్య అవకాశాలు చాలా టైట్ గా ఉన్నాయనే ప్రచారం అందరికీ తెలిసిందే. బీజేపీ తరపున నరేంద్రమోడీ, అమిత్ షా, జేపీ నడ్డా లాంటి స్టార్ క్యాంపెయినర్లంతా పదేపదే వెళ్ళి ప్రచారంలో పాల్గొంటున్నారు. బహిరంగసభలు, రోడ్డుషోలు, ర్యాలీల్లో చాలా బిజీగా ఉంటున్నారు. కాంగ్రెస్ విషయానికి వస్తే స్టార్ క్యాంపెయినర్లలో సోనియాగాంధి, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధితో పాటు రాహుల్ కూడా ఉన్నారు. సోనియా, ఖర్గే, ప్రియాంకలు బహిరంగసభలు, రోడ్డుషోలు, ర్యాలీల్లో పార్టిసిపేట్ చేశారు.
అయితే రాహుల్ మాత్రం ఇప్పటివరకు రాజస్ధాన్లో అడుగే పెట్టలేదు. గడచిన 37 రోజులుగా రాహుల్ ఒక్కసారి కూడా పర్యటించలేదు. దాంతో రాహుల్ కు ఏమైందని నేతలు, క్యాడర్ గోల చేస్తున్నారు. రెండుపార్టీల మధ్య పోటీ టైట్ గా ఉన్నపుడు పర్యటనలు ఎంతగానో ఉపయోగపడతాయని నేతలంతా ఎదురు చూస్తుంటే రాహుల్ మాత్రం అడ్రస్ లేకుండా తిరుగుతున్నారు. రాజస్ధాన్లో అడుగుపెట్టడానికి రాహుల్ ఎంతమాత్రం ఇష్టపడటంలేదు. రాహుల్ పర్యటించకపోవటం జనాల్లో తప్పుడు సంకేతాలను పంపుతోందని గోల పెరిగిపోతోంది.
నిజానికి ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత కూడా బీజేపీలో అంతర్గత పోరు చాలా ఎక్కువగానే జరిగింది. టికెట్ల కోసం ఆధిపత్య గొడవలు కూడా జరిగాయి. పార్టీలో జరిగిన గొడవలు చూసిన తర్వాత ఆనవాయితి తప్పుతుందేమో అని అనుకున్నారు. ప్రతి ఐదేళ్ళకు ఒకసారి ప్రభుత్వం మారిపోవటం రాజస్ధాన్లో ఆనివాయితి. అయితే కాంగ్రెస్ లో గెహ్లాట్-సచిన్ పైలెట్ వర్గాల గొడవలతో పాటు రాహుల్ అడుగు పెట్టకపోవటంతో బీజేపీకి అవకాశాలు మెరుగుపడ్డాయి. మరి జనాలు ఎలాంటి తీర్పిస్తారో చూడాల్సిందే.
This post was last modified on November 13, 2023 10:13 am
వైసీపీ ప్రభుత్వం అండ చూసుకొని సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, వారి కుటుంబ సభ్యులపై అసభ్యరమైన పోస్టులు…
ఈ రోజు సోషల్ మీడియా అంతటా ధనుష్-నయనతార గొడవ గురించే చర్చ. ధనుష్ మీద తీవ్ర విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తూ నయనతార…
ప్రభాస్ తన లైనప్ లో ఎన్ని క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేసినా కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఫోకస్ మాత్రం…
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం వైసీపీ లేని లోటును టీడీపీ ఎమ్మెల్యేలే తీర్చేస్తున్నారు. నిజానికి వైసీపీ ఉంటే కూడా ఇంతగా…
టాలీవుడ్లో అయినా.. మొత్తం ఇండియాలో అయినా… సోషల్ మీడియాలో అత్యధిక ట్రోలింగ్ ఎదుర్కొన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే మరో…
మాములుగా ఎంత పెద్ద సినిమా అయినా సరే మూడో వారంలోకి వచ్చాక నెమ్మదించడం సహజం. కానీ అమరన్ మాత్రం ఈ…