Political News

‘రేటెంత రెడ్డి’పై రేవంత్ రెడ్డి రియాక్షన్

తెలంగాణలో ఎన్నికల ప్రచార వేడి పతాక స్థాయికి చేరుకుంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచారాన్ని ఉద్ధృతంగా సాగిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికల సారథి రేవంత్ రెడ్డే బాగా హైలైట్ అవుతున్నారు. ఓవైపు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తూ.. మరోవైపు మీడియా చర్చల్లో పాల్గొంటూ చాలా బిజీగా గడుపుతున్నాడు రేవంత్ రెడ్డి. చాలా అగ్రెసివ్‌గా ఉండే రేవంత్.. ప్రత్యర్థులు తన మీద చేసే విమర్శలపై స్పందించే తీరే వేరుగా ఉంటుంది.

ఈ మధ్య ఒక టీవీ చర్చలో ఓటుకు నోటు కేసు గురించి ప్రస్తావిస్తే.. ఆ కేసు తనకో మెడల్ లాంటిది అని వ్యాఖ్యానించడం రేవంత్‌కే చెల్లింది. ఇక ఒక ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ.. కేసీఆర్‌ను ఉద్దేశించి ఆయన మాట్లాడిన బూతు మాట హాట్ టాపిక్ అయింది. ఇంకో టీవీ చర్చా కార్యక్రమంలో కేటీఆర్‌ను ‘ఫాల్తు గాడు’ అనేశాడు రేవంత్.

ఈ ఎన్నికల హడావుడి మొదలైన దగ్గర్నుంచి రేవంత్‌ రెడ్డి ఒక కొత్త పేరు ఖాయం చేశారు ప్రత్యర్థులు. కోట్ల రూపాయలకు టికెట్లు అమ్ముకున్నాడంటూ రేవంత్‌ను విమర్శిస్తూ ఆయన్ని ‘రేటెంత రెడ్డి’ అని సెటైరిక్‌గా పిలుస్తున్న సంగతి తెలిసిందే. సామాజిక మాధ్యమాల్లో ఈ పేరు బాగా పాపులర్ అయింది. ఒక టీవీ చర్చా కార్యక్రమంలో ఇదే విషయం ప్రస్తావించి.. మిమ్మల్ని రేటెంత రెడ్డి అంటున్నారు, దీనిపై మీరేమంటారు అని అడిగితే.. “సంతోష పడతా. నా పేరు పలకక తప్పదు. శత్రువైనా, మిత్రుడైనా ఎవ్వడైనా” అని రేవంత్ అన్నాడు.

రేట్లు ఉన్నందుకే మీ పేరు ‘రేటెంత రెడ్డి’ అయిందా అని దీనికి కొనసాగింపుగా ఒక ప్రశ్న వేస్తే.. “అంత డిమాండ్ ఉన్నదని అర్థం. రాష్ట్రంలో ఏది జరిగినా నా చుట్టూనే తిరగాలి. అప్పుడే నాకు ఆనందం వస్తది. దిష్టి బొమ్మ తగలబెట్టడం అనుకో. ఆరోపణలు చేయడం అనుకో. టికెట్లు ఇవ్వడం అనుకో. టికెట్ వచ్చినోడు నా పేరే చెప్పుకోవాలి. టికెట్ రానోడూ నా పేరే చెప్పుకోవాలి” అని రేవంత్ అన్నాడు.

This post was last modified on November 11, 2023 3:16 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఊపిరి పీల్చుకున్న విశ్వంభర

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…

3 hours ago

పోకిరి రేంజ్ ట్విస్ట్ ఇచ్చిన రావిపూడి

ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…

7 hours ago

ఇళయరాజా అభయమందుకున్న వరప్రసాద్ గారు

మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…

9 hours ago

విజ‌య్‌కు సీబీఐ సెగ‌… `పొత్తు` కోసమా?

త‌మిళ దిగ్గ‌జ న‌టుడు, త‌మిళగ వెట్రి క‌గ‌ళం(టీవీకే) అధ్య‌క్షుడు విజ‌య్ వ్య‌వ‌హారం.. మ‌రింత ముదురుతోంది. గ‌త ఏడాది సెప్టెంబ‌రు 27న‌…

9 hours ago

చేతులు కాలాక ఆలోచిస్తే ఏం లాభం

రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…

9 hours ago

నారావారి ప‌ల్లెముచ్చ‌ట్లు: మ‌న‌వ‌డి ఆట‌లు – తాత మురిపాలు

ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత గ్రామం.. ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని నారావారి ప‌ల్లెలో ముంద‌స్తు సంక్రాంతి వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు.…

11 hours ago