Political News

జ‌న‌సేన‌-టీడీపీ పొత్తు… ఏపీ ఓట‌రు తీరు మారుతోంది..!

వ‌చ్చే 2024 ఎన్నిక‌ల్లో ఉమ్మ‌డిగా ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతామ‌ని ప్ర‌క‌టించిన జ‌న‌సేన‌-టీడీపీల వ్యూహం ఫ‌లించే అవ‌కాశం ఉంద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ఎందుకంటే.. ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయాలు చేసేందుకు మ‌రో పార్టీ లేక‌పోవ‌డం.. రాష్ట్రంలో చ‌ర్చ‌కు వ‌చ్చింది. దీంతో జ‌న‌సేన‌-టీడీపీల బంధంపైనే ఇప్పుడు చ‌ర్చ సాగుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీని అధికారం నుంచి దింపేస్తామ‌నే వాద‌ననుజ‌న‌సేన బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లిన విష‌యం తెలిసిందే.

ముఖ్యంగా ప‌వ‌న్ అభిమానులు, పార్టీ కార్య‌క‌ర్త‌లు.. ఈ విష‌యంలో అలెర్ట్‌గానే ఉన్నారు. ఇక‌, టీడీపీ కూడా .. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకోవాలంటే.. ఖ‌చ్చితంగా జ‌న‌సేన‌తో క‌లిసి ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్న ద‌రిమిలా.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు విభేదాల‌తో న‌డిచిన రాజ‌కీయాలు ఇప్పుడు స‌ర్దుకుపోతున్నాయి. దీంతో క‌లివిడిగా.. ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా అనంత‌పురం, క‌ర్నూలు వంటి జిల్లాల్లో జ‌న‌సేన అభ్య‌ర్థుల‌ను క‌లుపుకొని పోతున్నారు.

ఇది మంచి సంకేతాల‌ను ఇస్తోంది. ఇక‌, రాష్ట్రంలోని విజ‌య‌న‌గ‌రం, శ్రీకాకుళం జిల్లాల్లోనూ జ‌న‌సేన‌తో క‌లిసి పోటీ చేసేందుకు ఇక్క‌డి నాయ‌కులు కూడా రెడీగానే ఉన్నారు. తాజాగా నిర్వ‌హించిన కొన్ని ఆన్‌లైన్ స‌ర్వేలు ఇదే విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా క్షేత్ర‌స్థాయిలో అభిమానులు క‌లిసి ప‌నిచేసేందుకు రెడీగా ఉన్నార‌నే సంకేతాలు క‌నిపిస్తున్నాయి. ఇక‌, గ్రామీణ స్థాయిలో మాత్రం.. ఇంకా పొత్తుల విష‌యంపై ఒక అవ‌గాహ‌న ఏర్ప‌డ‌లేదు.

కీల‌క‌మైన గ్రామీణ స్థాయిలో ఓట‌ర్ల‌ను కూడా ఈ రెండు పార్టీలూ క‌దిలించే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేయాల్సిన అస‌వ‌రం ఉంది. లేక‌పోతే.. గ్రామీణ ఓటు బ్యాంకు చీలిపోయే అవ‌కాశం ఉంద‌ని మెజారిటీ నాయ‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇక‌, పొత్తుతో క‌లిసి వ‌చ్చేందుకు క‌మ్యూనిస్టులు కూడా రెడీగానే ఉన్నారు. అయితే.. వీరు బీజేపీని ప‌క్క‌న పెడుతున్నారు. బీజేపీ లేకుండా ఉంటే.. జ‌న‌సేన‌-టీడీపీ-క‌మ్యూనిస్టులు క‌లిసి పోటీ చేయాల‌నేది వ్యూహం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on November 11, 2023 1:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

లేడీ డాన్లకు వార్నింగ్ ఇచ్చిన సీఎం

ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…

4 minutes ago

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

42 minutes ago

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

1 hour ago

శివన్న డెడికేషనే వేరు

తెలంగాణ‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…

2 hours ago

పర్ఫెక్షన్లో రాక్షసుడు జక్కన్న

బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…

3 hours ago

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

5 hours ago