తెలంగాణ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురు దెబ్బతగిలింది. మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతి కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు. గత కొన్నాళ్లుగా పార్టీలో యాక్టివ్ గానే ఉన్నప్పటికీ.. ఆమెకు తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆమె అలకబూనారు. ఈ క్రమంలో కీలక నేతలు ఆమెను బుజ్జగిస్తారనే చర్చ సాగింది. కానీ, ఎవరూ పాల్వాయి స్రవంతిని పట్టించుకోలేదు.
దీంతో ఆమె పార్టీ మారేందుకు సన్నాహాలు చేసుకున్నారు. దీనిపై బహిరంగంగానే చర్చకు పెట్టారు. అయినా కూడా కాంగ్రెస్ నేతలు ఆమెను పట్టించుకున్న దాఖలా కనిపించలేదు. ఈ క్రమంలో తాఆజగా కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె రెండు పేజీల మేరకు రిజైన్ లెటర్ రాశారు. పార్టీలో తన తండ్రి ఎప్పటి నుంచి సేవలు అందించారు. తాను పార్టీ కోసం ఎలాకష్టపడిందీ ఆమె వివరించారు. అంతేకాదు.. మునుగోడులో ఉద్దేశ పూర్వకంగా నే కొందరు తనను ఓడించారని ఆమె విమర్శించారు.
కాగా.. తాజాగా ఆమె బీఆర్ ఎస్ కండువా కప్పుకొనేందుకు సిద్ధమయ్యారు. గత ఏడాది జరిగిన మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలో పాల్వాయి స్రవంతి పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. అయితే.. ఆ ఎన్నికలోఆమె ఓడిపోయారు. ఇదిలావుంటే, మునుగోడు ఉప ఎన్నికకు కారణమైన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. తిరిగి కాంగ్రెస్‌లోకి రావడం, ఆ వెంటనే ఆయనకు ఈ సీటును ఖరారు చేయడం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలోనే స్రవంతి కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పడం గమనార్హం.
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…
హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…