Political News

‘ఏపీలో రాష్ట్ర‌ప‌తి పాల‌న‌’

ఏపీలో రాష్ట్ర‌ప‌తి పాల‌న పెట్టాల‌ని టీడీపీ నాయ‌కుడు, మాజీ మంత్రి, స‌త్తెన‌ప‌ల్లి ఇంచార్జ్ క‌న్నా ల‌క్ష్మీనా రాయ‌ణ డిమాండ్ చేశారు. నిన్నెందుకు న‌మ్మాలి జ‌గ‌న్ అంటూ.. ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా మీడియాతో మాట్లాడిన క‌న్నా.. సీఎం జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు. అధికారం ఉంటే రాష్ట్రాన్ని ఎలా దోచేయవచ్చొ జగన్ నిరూపించారని మండిప‌డ్డారు.

16 నెలల పాటు జైల్లో ఉండి ఎలా దోచుకోవచ్చో రీసెర్చి చేశారని దుయ్య‌బ‌ట్టారు. ఏపీని జగన్ సర్వనాశనం చేశారని మండిపడ్డారు. ఏపీకి జగన్‌ ఎందుకు అవసరం లేదో వంద కారణాలు చెబుతామని.. వంద కారణాలతో పుస్తకం వేస్తామని తెలిపారు. పోలవరం కట్టలేదని, రాజధాని లేకుండా చేశారని విరుచుకుపడ్డారు. ఒకసారి అవకాశం ఇస్తే ఏపీని తెలంగాణకు తాకట్టు పెట్టారని క‌న్నా వ్యాఖ్యానించారు.

మరోసారి అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని జ‌గ‌న్‌ బ్రిటీష్ వాడికి అమ్మేస్తారని క‌న్నా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నాసిరకం సారా అమ్ముకుంటూ తాగుబోతులను పెంచారన్నారు. దళితులకు జగన్ చేసినంత ద్రోహం ఇంకే ముఖ్యమంత్రి చేయలేదని దుయ్య‌బ‌ట్టారు. విశాఖలో భూములు కొట్టేయడానికే కొత్త అసైన్మెంట్ చట్టం చేశారన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను భయపెట్టి బానిసలుగా చేస్తున్నారని.. మీడియా సమావేశం పెడితే పోలీసులను కాపలా పెట్టారని క‌న్నా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో స్వేచ్ఛగా బ‌తకాలన్నా రాష్ట్రపతి పాలన కావాలన్నారు. త్వ‌ర‌లోనే తాము ఈ రాష్ట్రానికి జ‌గ‌న్ ఎందుకు వ‌ద్దో.. ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తామ‌ని క‌న్నా వ్యాఖ్యానించారు. జ‌గ‌న్ పాల‌న‌పై బుక్‌లెట్ వేస్తామ‌ని చెప్పారు.

This post was last modified on November 11, 2023 1:35 pm

Share

Recent Posts

పరీక్షలు బాగా రాపించి సినిమాకి తీసుకురండి

చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…

2 hours ago

హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు ఏపీ సర్కార్?

ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…

2 hours ago

ఏపీలో బీసీ రిజర్వేషన్లపై సంచలన తీర్పు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…

4 hours ago

అక్టోబర్ మార్కెట్… ఎవరెవరికి జాక్‌‌పాట్

కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…

4 hours ago

రాజమౌళి టచ్ చేసిన స్క్రిప్ట్… హిట్ కొడతారా?

గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…

4 hours ago

దృశ్యం బ్రాండ్ విలువ మహత్యం

బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…

5 hours ago