నిర్విరామంగా తెలంగాణా ఎన్నికల్లో ప్రచారం చేస్తున్న కేసీయార్ మూడురోజులు బ్రేక్ తీసుకున్నారు. ఈ బ్రేక్ ఎందుకంటే వివిధ నియోజకవర్గాల్లో అభ్యర్ధుల ప్రచారసరళి ఎలాగుంది, పార్టీ గెలుపు అవకాశాలు ఎంతున్నాయి ? గెలుపుకు అనుసరించాల్సిన వ్యూహాలు ఏమిటనే విషయాలను పార్టీ ముఖ్యులతో చర్చించి సరికొత్త వ్యూహాలు రచించేందుకేనట. రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్ పోటీపైన ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. ఇందుకోసమే శుక్ర, శని, ఆదివారాలు పూర్తిగా ఫాం హౌస్ కే పరిమితమయ్యారు.
పీసీసీ ప్రెసిడెంట్ పోటీ చేస్తున్న కామారెడ్డి, కొడంగల్, బీజేపీ సిట్టింగ్ ఎంఎల్ఏ ఈటల రాజేందర్ పోటీచేస్తున్న గజ్వేల్, హుజూరాబాద్ నియోజకవర్గాలతో పాటు మరికొందరు ప్రత్యర్ధిపార్టీల నేతల నియోజకవర్గాలపై ప్రత్యేకంగా కేసీయార్ దృష్టి పెట్టినట్లు సమాచారం. కొన్ని నియోజకవర్గాల్లో ప్రత్యర్ధిపార్టీల అభ్యర్ధులను ఓడించేందుకు ఎలాంటి వ్యూహాలను అనుసరించాలనే విషయాలను మంత్రులు కేటీయార్, హరీష్ రావు తదితరులతో చర్చించనున్నారు. అక్బోటర్ 15వ తేదీన హుస్నాబాద్ నియోజకవర్గం బహిరంగసభతో కేసీయార్ తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.
గురువారం వరకు మొత్తం 43 బహిరంగసభల్లో పాల్గొన్నారు. దీపావళి పండుగ తర్వాత 13వ తేదీ నుండి 28 వరకు 54 బహిరంగసభలు నిర్వహించబోతున్నారు. సగటున రోజుకు కేసీయార్ 3 నియోజకవర్గాల్లో సభలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు బహిరంగసభల మీదే దృష్టిపెట్టిన కేసీయార్ 18వ తేదీన చేర్యాలలో భారీ రోడ్డుషో పై దృష్టిపెట్టారు. ఈ రోడ్డుషో ఫీడ్ బ్యాక్ ఆధారంగా మరిన్ని నియోజకవర్గాల్లో రోడ్డుషోలకు ప్లాన్ చేయాలని నిర్ణయించారు. రేవంత్, ఈటలను వీలైనంత వరకు వాళ్ళు పోటీచేస్తున్న కొడంగల్, గజ్వేల్, కామారెడ్డి, హుజూరాబాద్ నియోజకవర్గాలకే పరిమితం చేసేట్లుగా కేసీయార్ వ్యూహాలు రచిస్తున్నారు. అయితే ఈ వ్యూహాలు రేవంత్ విషయంలో పెద్దగా వర్కవుటయ్యేట్లు కనబడటంలేదు.
ఎందుకంటే పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ తెలంగాణా అంతా విస్తృతంగా పర్యటన చేయక తప్పదు. అందుకనే తాను పోటీచేస్తున్న కొడంగల్, కామారెడ్డిలో ప్రచారం విషయంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ముందుగానే చేసుకున్నారు. బీఆర్ఎస్ అభ్యర్ధుల గెలుపుకు ఇప్పటికే పార్టీపరంగా ప్రతి నియోజకవర్గంలోను ఏర్పాటుచేసిన వార్ రూముల ఫీడ్ బ్యాక్ నే కేసీయార్ ఎక్కువగా నమ్ముతున్నారట. దానికి అనుగుణంగానే చర్యలు తీసుకునే బాధ్యతలను కేటీయార్, హరీష్ రావులకు అప్పగించారు.
This post was last modified on November 11, 2023 1:30 pm
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ…
అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఫ్యాన్స్ కోసం లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వనప్పటికీ…
ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందబోయే ప్యాన్ ఇండియా మూవీ మీద…