ప్రశ్నలు వేయటానికి ముడుపులు తీసుకున్న ఎంపీ మహువా మొయిత్రాపై బహిష్కరణ వేటు వేయాలని ఎథిక్స్ కమిటి సిఫారసు చేసింది. ఆ సిఫారసుల రిపోర్టు శుక్రవారం లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాకు అందబోతోంది. ఎథిక్స్ కమిటి ఛైర్మన్, సభ్యులు తమ రిపోర్టుతో స్పీకర్ ను కలవబోతున్నారు. ఇప్పటికే మొయిత్రాకు వ్యతిరేకంగా 500 పేజీల రిపోర్టును తయారైంది. ఎంపీపై అనర్హత వేటు వేయాలని ముందుగా అనుకున్నా తాజాగా బహిష్కరణ వేటు వేయాలని కమిటి 6:4 ఓట్లతో ఆమోదించింది. దాంతో ఎంపీపై బహిష్కరణ విషయంలో ఎథిక్స్ కమిటి చాలా పట్టుదలగా ఉన్న విషయం అర్ధమవుతోంది.
నిజానికి ప్రశ్నలు వేయటానికి ఎంపీలు ముడుపులు తీసుకోవటం అన్నది నైతికత కిందకు మాత్రమే వస్తుంది. తీసుకోవచ్చు లేదా తీసుకోకూడదన్న విషయమై ఎలాంటి చట్టంలేదు. ప్రశ్నలు వేయటానికి ముడుపులు తీసుకున్నట్లు నిర్ధారణ అయితే వెంటనే సదరు ఎంపీపై చర్యలు తీసుకోవాలని ప్రజా ప్రాతినిధ్య చట్టంలో ఎక్కడా లేదు. ఎంతమంది ఎంపీలు ప్రశ్నలు వేయటానికి ముడుపులు తీసుకుంటున్నారో తెలీదు కానీ మొయిత్రా విషయంలో మాత్రం బయటపడింది.
ప్రశ్నలు వేసినందుకు డబ్బులు తీసుకున్నా వస్తురూపంలో తీసుకున్నా ముడుపులు ముడుపులే అనటంలో సందేహంలేదు. కాకపోతే ఇక్కడ మొయిత్రా విషయంలో ఏమి జరుగుతోంది ? ఏమి జరుగుతోందంటే ప్రభుత్వాన్ని గడచిన నాలుగున్నరేళ్ళుగా లోక్ సభలో మొయిత్రా ముప్పుతిప్పలు పెడుతోంది. నరేంద్రమోడీ ప్రభుత్వంపై మహువా ఓ రేంజిలో విరుచుకుపడుతున్నారు. దాంతో మోడీ ప్రభుత్వం, బీజేపీ మొయిత్రాపై బాగా మండిపోతోంది. అయితే ఎంపీని ఏమి చేయలేక మౌనంగా భరిస్తోంది.
సరిగ్గా ఇలాంటి పరిస్ధితుల్లోనే ప్రశ్నలకు ముడుపులు అనే వివాదంలో మొయిత్రా ఇరుక్కున్నారు. పైగా ఎథిక్స్ కమిటి విచారణలో ప్రశ్నలు వేసినందుకు తాను పారిశ్రామికవేత్త హీరానందాని నుండి మేకప్ కిట్ అందుకున్నట్లు అంగీకరించారు. ప్రచారం జరుగుతున్నట్లు తాను డబ్బులు తీసుకోలేదని కేవలం మేకప్ కిట్లు, లిప్ స్టిక్స్ మాత్రమే తీసుకున్నట్లు అంగీకరించారు. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే మొయిత్రాకు మాత్రమే పరిమితమవ్వాల్సిన ఎంపీ లాగిన్, పాస్ వర్డ్ హీరానందనీ చేతికి వెళ్ళింది. ఆయన దుబాయ్ నుండి పార్లమెంటు పోర్టల్లో అనేక ప్రశ్నలు సంధించారు. ఆ ప్రశ్నలన్నీ ఎంపీనే వేస్తున్నారని అనుకుని పార్లమెంటు సెక్రటేరియట్ కూడా జవాబులిచ్చింది. తర్వాత అర్ధమైంది ఎంపీ వేయటంలేదని. ఇవన్నీ కలిసి ఇపుడు ఎంపీ మెడకు చుట్టుకుంది. చివరకు ఏమవుతుందో చూడాలి.
This post was last modified on November 10, 2023 2:51 pm
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. తన కుమార్తె గ్రాడ్యుయేషన్…
వరసగా నాలుగో బ్లాక్ బస్టర్ బాలకృష్ణ ఖాతాలో వేసిన డాకు మహారాజ్ ఎనిమిది రోజులకు 156 కోట్లకు పైగా గ్రాస్…
తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, ఎనుముల రేవంత్ రెడ్డిలు ఎవరు ఔనన్నా… కాదన్నా… గురుశిష్యులే.…
గేమ్ ఛేంజర్ ఫలితం తేలిపోయింది. పండగ సెలవులు పూర్తి కాకముందే డిజాస్టర్ ముద్ర పడిపోయింది. యావరేజ్ అయినా అభిమానులు కాస్త…
డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ భద్రతకు తాము అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ఏపీ డీజీపీ ద్వారకా…
టిక్ టాక్... చైనాకు చెందిన ఈ షార్ట్ వీడియో షేరింగ్ ప్లాట్ ఫామ్ అగ్రరాజ్యం అమెరికాలో నిషేధానికి గురైపోయిన సోషల్…