Political News

పాలేరులో భ‌య‌ప‌డుతోన్న ‘పొంగులేటి ‘!

ఖమ్మం జిల్లా పాలేరులో గెలిచి తీరుతానని సవాల్ విసురుతున్న మాజీ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఓటమి భయం పట్టుకున్నట్టే కనిపిస్తోంది. శ్రీనివాసరెడ్డి కొద్దిరోజుల క్రితం బిఆర్ఎస్ నుంచి పార్టీ మారి కాంగ్రెస్‌లోకి జంప్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేసీఆర్‌ను టార్గెట్ చేసిన శ్రీనివాస్ రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కూడా గెలవనీయన‌ని.. ఉమ్మ‌డి జిల్లాలో పోటీ చేస్తోన్న బీఆర్ఎస్ అభ్యర్థుల్లో ఏ ఒక్క‌రిని అసెంబ్లీ గేటు కూడా దాటానియను అంటూ సినిమా స్టైల్ లో డైలాగులు చెప్పారు.

పొంగులేటికి కేసీఆర్ త‌న‌దైన స్టైల్లో కౌంట‌ర్ ఇచ్చేశారు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టిఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థుల ఓటమి సంగతి దేవుడు ఎరుగు.. కానీ ఇప్పుడు పాలేరులో ఆయనకు ఓటమి భయం పట్టుకున్న సంకేతాలు క్లియర్‌గా కనిపిస్తున్నాయి. పొంగులేటిపై బిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే కందాళ‌ ఉపేందర్ రెడ్డి రెండు నెలలుగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆయనకు నియోజకవర్గంలో గ్రామ గ్రామాన.. అణువణువునా పరిచయాలు ఉన్నాయి.

ఇటు శ్రీనివాస్‌ రెడ్డి కనీసం ఒక్క మండలంలో కూడా పూర్తిగా తిరిగిన దాఖలాలు లేవు. అసలు ఇప్పటికీ పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ కేడర్ తో కూడా ఆయన మమేకం కాలేదు. మండల స్థాయిలో కీలక కాంగ్రెస్ నాయకులు ఎవరు ? అన్నది కూడా తెలియని పరిస్థితి. మరి ఇలాంటి పొంగులేటి రేపటి ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఎలా పోటీ చేస్తారు ? అన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. పైగా నాన్ లోకల్ కావడంతో కాంగ్రెస్ కేడర్ చాలా మందికి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి సహకరించే పరిస్థితి లేదు.

ఇదిలా ఉంటే బీఆర్ ఎస్ లో ఉన్నప్పుడు పొంగులేటి, తుమ్మల వర్గాలు కత్తులు దూసుకున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చి పొంగులేటి.. తుమ్మల చేతులు కలిపినా క్షేత్రస్థాయిలో ఈ రెండు వర్గాలకు చెందిన నాయకులు పూర్తిగా సహకరించుకునే పరిస్థితి అయితే లేదు. పాలేరులో 2016 ఉప ఎన్నికల్లో రాష్ట్రస్థాయి నాయకులు అందరూ ప్రచారం చేయటంతో గెలిచిన తుమ్మల 2018 ముందస్తు ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. ఆయన ఈ నియోజకవర్గానికి రెండేళ్ల పాటు చుట్టం చూపుగా వచ్చి వెళ్లిపోయారు. ఇక ఇక్కడ తుమ్మల అనుచరులతో పాటు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్న కమ్మ సామాజిక వర్గం ఓటర్లు తనకు సహకరిస్తారని.. తన గెలుపు సులువ అవుతుందని పొంగులేటి ముందు నుంచి ఆశలు పెట్టుకున్నారు.

అయితే నేలకొండపల్లి, కూసుమంచి, ఖమ్మం రూరల్ మండలాల్లో ఉన్న కమ్మ‌ సామాజిక వర్గం ఓటర్లతో పాటు తుమ్మల అనుచరులు పొంగులేటికీ ఏమాత్రం సహకరించే పరిస్థితి లేదు. అసలు గత ఎన్నికల్లో తుమ్మల ఓటమికి పొంగులేటి కారణం అని వాళ్ళు ఇప్పటికీ పళ్ళు నూరుతున్నారు. దీంతో పైకి తూతూ మంత్రంగా పొంగులేటికి జై కొడుతున్న.. పొంగులేటికి ఓట్లు వేసే పరిస్థితి ఏమాత్రం లేదు. పైగా కందాళ‌ తుమ్మల అనుచరులతో పాటు కమ్మ సామాజిక వర్గానికి ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు. కూసుమంచి జడ్పిటిసి పదవితో పాటు ఆమె భర్త ఇంటూరి శేఖర్ ను డిసిసిబి డైరెక్టర్ ప‌ద‌వి ఇప్పించ‌డంతో పాటు ఇటు ఖ‌మ్మం రూర‌ల్ నుంచి ఎంపీపీ బెల్లం ఉమాతో పాటు ఆమె భ‌ర్త వేణుకు ఎన‌లేని ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక్క‌డ వాళ్ల‌దే హ‌వా..!

దీంతో క‌మ్మ వ‌ర్గంలో మెజార్టీ పొంగులేటి వెంట వెళ్లే ప‌రిస్థితి లేదు. ఇక సీపీఎం నుంచి త‌మ్మినేని వీర‌భ‌ద్రం పోటీ చేస్తే అటు కూడా సీపీఎంతో పాటు తుమ్మ‌ల అనుచ‌రుల ఓట్లు మ‌ళ్లే ప‌రిస్థితి ఉంది. త‌మ్మినేని 10 వేల ఓట్లు చీల్చినా కూడా ఇంత ట‌ఫ్ ఫైట్‌లో పొంగులేటి ఓడిపోయే ప్ర‌మాద‌మే ఆయ‌న‌కు ముంచుకొచ్చేలా ఉంది. ఏదేమైనా ఉమ్మ‌డి ఖ‌మ్మంలో బీఆర్ఎస్ ను గెలిపించ‌డం సంగ‌తేమో గాని పాలేరులో పొంగులేటి గెలిస్తే గ్రేట్ అన్న‌ట్టుగా ప‌రిస్థితి ఉంది.

This post was last modified on November 10, 2023 12:04 pm

Share

Recent Posts

బుమ్రా తిరిగొచ్చాడు.. కానీ..

రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు ఢిల్లీలో జరిగిన…

38 minutes ago

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

4 hours ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

4 hours ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

5 hours ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

6 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

6 hours ago