పది కోట్లు.. ప్రభుత్వాల విషయంలో ఏమంత పెద్ద ఎమౌంట్ కాకపోవచ్చు. కానీ, ఎన్నికల వేళ పది లక్షలై నా కూడా రాజకీయంగా ప్రభావం చూపుతుంది. దీంతో సొమ్ముపై ప్రత్యర్థి పార్టీల నిఘా ఎప్పుడూ ఉంటుం ది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితే ఏపీలోనూ కనిపిస్తోంది. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం “వై ఏపీ నీడ్స్ జగన్” (ఏపీకి జగనే ఎందుకు కావాలి) అనే కార్యక్రమాన్ని చేపట్టింది.
ఈ కార్యక్రమం పూర్తిగా వైసీపీకి చెందినదే!. వచ్చే ఎన్నికల్లో మరోసారి సీఎంగా జగన్‌కు ఎందుకు అవకా శం ఇవ్వాలి? ఆయన ఇప్పుడు చేస్తున్న కార్యక్రమాలు, అమలు చేస్తున్న పథకాలు, ఏయే కుటుంబాలకు ఎంత లబ్ధి చేకూరింది? వంటి వివరాలను ప్రజలకు చేరవేసి.. తద్వారా వారిని తమవైపు తిప్పుకోవాలనే ది ప్రధాన ఉద్దేశం. అంతేకాదు.. ఉయ్ నీడ్ జగన్(జగన్ మాకు అవసరం) అని ప్రజలతో అనిపించుకోవా లనే కాన్సెప్టు కూడా ఉంది.
మొత్తంగా ఇది పార్టీ కార్యక్రమం. అయితే.. దీనిలో అధికారులను సీఎం జగన్ ఇన్వాల్వ్ చేశారు. కలెక్టర్ల నుంచి ఉన్నతాధికారుల వరకు క్షేత్రస్థాయిలో గ్రామ అధికారుల వరకు ఈ కార్యక్రమాన్ని పది రోజుల పాటు నిర్వహించాలని నిర్దేశించారు. మొత్తానికి ఈ కార్యక్రమం కూడా ప్రారంభమైంది. అయితే.. ఈ కార్యక్రమానికి సంబంధించి 24 పేజీలతో ముద్రించిన బ్రోచర్ ఇప్పుడు వివాదానికి దారితీసింది. ఈ బ్రోచర్ రూపొందించేందుకు ప్రభుత్వం రూ.10 కోట్లపైచిలుకు వ్యయం చేసిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఆ వెంటనే ఈ విషయాన్ని కేంద్రానికి సమాచారం కూడా ఇచ్చినట్టు సమాచారం. దీంతో ఎన్నికల సీజన్ కావడం, వచ్చే ఎన్నికల్లో మెరుగైన ఫలితం కోసం బీజేపీ కూడా ఎదురు చూస్తున్న నేపథ్యంలో లెక్కలు తేల్చాలంటూ.. రాష్ట్ర నేతలు డిమాండ్ చేశారు. ఈ పరిణామాలపై రూ.10 కోట్లు ఎవరి ఖాతాలోవి? అంటూ.. కేంద్రం ఆఘమేఘాలపై ఆరా తీయడం ప్రారంభించింది. మరి దీనికి వైసీపీ ఏం చెబుతుందో చూడాలి. ఇప్పటికే కేంద్రం ఇస్తున్న నిధులను దారిమళ్లిస్తున్నారని.. మీ పేరు వేసుకుంటున్నారని.. బీజేపీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో తాజా పరిణామం రాజకీయ వివాదంగా మారింది.
This post was last modified on November 10, 2023 11:24 am
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…