తెలంగాణ ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరింది. ఇంకో 20 రోజుల్లోనే ఎన్నికలు జరగబోతుండటంతో అన్ని ప్రధాన పార్టీలూ ప్రచారాన్ని పతాక స్థాయికి తీసుకెళ్తున్నాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ పదేళ్లుగా తాము సాధించిన ఘనతల్ని చెప్పుకుంటూ.. కాంగ్రెస్ వస్తే చాలా కష్టం అనే సంకేతాలు ఇస్తూ జనాలను తమ పార్టీ వైపే నిలబెట్టే ప్రయత్నం చేస్తోంది. ఆ పార్టీకి మద్దతుగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెర్స్.. ఫిలిం, టీవీ సెలబ్రెటీలు రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నారు.
మామూలుగా ప్రచారంలో సంప్రదాయ, పాత పద్ధతులను అనుసరించే కాంగ్రెస్ పార్టీ ఈసారి మాత్రం ట్రెండీ క్యాంపైనింగ్‌తో దూసుకెళ్తుండటం విశేషం. ఒక రకంగా చెప్పాలంటే ఎన్నికల ప్రచారంలో ఆ పార్టీనే దూకుడు మీదుంది. వాళ్ల క్యాంపైనింగ్‌గా కూడా వినూత్నంగా సాగుతోంది. ముఖ్యంగా అధికార పార్టీని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ వాళ్లు చేసిన యాడ్స్ సోషల్ మీడియాలో, టీవీల్లో సూపర్ హిట్ అయ్యాయి.
కేసీఆర్‌ను పోలిన వ్యక్తితో కాంగ్రెస్ వాళ్లు చేసిన యాడ్స్ భలే ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. కేసీఆర్ తన మాటలతో జనాలను మాయ చేస్తున్నట్లు.. జనం తిరగబడి ఆయన్ని తరిమికొడుతున్నట్లుగా ఈ యాడ్స్ ఉన్నాయి. గాలి పోయిన కారును తోసుకెళ్తున్నట్లుగా ప్రతి యాడ్‌ను ముగిస్తున్నారు. యాడ్స్ షార్ప్‌గా, స్ట్రైకింగ్‌గా ఉండటంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మామూలుగా కాంగ్రెస్ అంటే ముతక స్టయిల్లో క్యాంపైనింగ్ సాగుతుందనే అభిప్రాయాలుంటాయి. ఎప్పుడూ ఆ శైలిలోనే సాగేది వాళ్ల ప్రచారం. కానీ ఈసారి మాత్రం క్రియేటివ్‌గా ఆలోచించారు. ఈ కాన్సెప్ట్‌లు ఎవరు తయారు చేస్తున్నారు.. యాడ్స్ రూపొందించింది ఎవరు అన్నది తెలియదు కానీ.. కాంగ్రెస్ నుంచి ఇలాంటి ట్రెండీ, అగ్రెసివ్ యాడ్స్ రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
This post was last modified on November 10, 2023 10:20 am
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్‌గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…