ఏపీ వైసీపీలో ఇదే మాట వినిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు అలుపెరగకుండా ప్రజల మధ్య ఉన్న నాయ కులు.. ప్రజల ఇంటింటి చుట్టూ తిరిగిన నాయకులు అనేక మంది ఉన్నారు. కొందరు తూతూ మంత్రంగా కార్యక్రమాలు నిర్వహించిన మిగిలిన వారు చాలా మంది మనసు పెట్టారు. గడపగడపకు మన ప్రభుత్వం, మా నమ్మకం నువ్వే జగన్ కానీ, వైనాట్ 175 కానీ.. ఇలా అనేక కార్యక్రమాలు వైసీపీ ఎమ్మెల్యేలు చేశారు. చేస్తున్నారు.
అయితే.. ఇప్పుడు వారికి కాస్త రెస్ట్ దొరికిందనే టాక్ వైసీపీలో వినిపిస్తోంది. ఎందుకంటే.. ఇక, వైసీపీ ప్రచార బాధ్యతను నాయకులు చూడాల్సిన అవసరం లేదు. అధికారులే చూసుకుంటారు. గురువారం నుంచి రాష్ట్రంలో వై జగన్ నీడ్స్ ఏపీ (ఏపీకి జగనే ఎందుకు కావాలి) అనే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం క్షేత్రస్థాయిలో అన్ని జిల్లాలలోనూ జరగనుంది.
ఇక, ఈ కార్యక్రమానికి.. నాయకులతో సంబంధం లేదు. వారు కూడా పాల్గొనరు. ఎక్కడికక్కడ డిప్యూటీ కలెక్టర్ నుంచి కలెక్టర్ వరకు, తహసీల్దార్ నుంచి రెవెన్యూ ఉద్యోగుల వరకు వారే పాల్గొంటారు. ప్రభుత్వం ఏ కుటుంబానికి ఎంత ఖర్చు చేసింది? ఏ కులానికి, ఏ మతానికి ఈ నాలుగున్నరేళ్ల కాలంలో వెచ్చించింది? వచ్చే ఆరు మాసాల కాలంలో ఇంకెత సొమ్ము కేటాయించనుంది? ఒక్కక్క కుటుంబానికీ జరిగిన లబ్ధి ఎంత? జగన్ తీసుకున్న సంచలన నిర్ణయాలు ఏవి? అనే విషయాలను అధికారులు పూస గుచ్చినట్టు వివరించనున్నారు.
దీంతో ఇప్పటి వరకు అలుపెరగకుండా.. ప్రజల మధ్యే ఉన్న ఎమ్మెల్యేలు, ఇంచార్జ్‌లకు ఒకింత రెస్ట్ దొరుకుతుందనే చర్చ వైసీపీలో ఉంది. నిజానికి ప్రభుత్వ కార్యక్రమాలను నాయకుల కన్నా అధికారులు చెబితేనే సక్సెస్ అయిన సందర్భాలు ఒకటి రెండు రాష్ట్రాల్లో ఉన్నాయి. ఇది వాస్తవానికి గుజరాత్ ఫార్ములా అని అంటారు. అక్కడ బీజేపీ ప్రభుత్వం అధికారులను రంగంలోకి దింపి.. ఇదే చేస్తోంది. ఇప్పుడు కేంద్రంలోని మోడీ కూడా.. సీనియర్ అధికారులతో పార్టీ కార్యక్రమాలను గోప్యంగా నిర్వహిస్తున్నారు. మొత్తానికి ఈ పరిణామంతో వైసీపీ నేతలకు విరామం లభిస్తుందా? లేదా? అనేది చూడాలి.
This post was last modified on November 9, 2023 8:24 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…