“మా పథకాలకు మీ బొమ్మలు.. మీ పేర్లు వేసుకుంటున్నారు. ఇలా కుదరదు.”- అని కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు.. తాజాగా సీఎం జగన్‌కు తేల్చి చెప్పిన ఘటన చర్చనీయాంశం అయింది. రాష్ట్ర బీజేపీ నాయకులు.. ఇక్కడ జరుగుతున్న పరిణామాలను కేంద్రానికి వివరించడం.. కేంద్రం నుంచి మంత్రి అధావలే ఇటీవల వచ్చి ఇక్కడి పథకాల పేర్లు పరిశీలించడం తెలిసిందే. ఆ వెంటనే కేంద్రం.. జగన్ సర్కారుకు తాఖీదు పంపింది.
ఇలా అయితే.. మీకు నిధులు ఆపేస్తాం అని కూడా తేల్చి చెప్పినట్టు తెలిసింది. కట్ చేస్తే.. ఇలాంటి పరిస్థితి గతంలోనూ చంద్రబాబు హయాంలో వెలుగు చూసింది. ముఖ్యంగా టిడ్కో ఇళ్లు, ఫైబర్ నెట్, గ్రామీణ సడక్ యోజన, ఉపాధి హామీ, డ్వాక్రా పథకాల విషయంలో చంద్రబాబు దూకుడును అప్పట్లోనూ కేంద్రం ప్రశ్నించింది. ఇలా అయితే.. నిధులు ఆపేస్తామని అప్పట్లోనూ బాబు సర్కారుకు తాఖీదు పంపించింది.
అయితే, అప్పట్లో చంద్రబాబు ఫైట్ చేశారు. కేంద్రం ఇచ్చే నిధులు ఏమీ గ్రాంట్స్ కాదని.. ఇక్కడి ప్రజలు చెల్లిస్తున్న పన్నుల్లో న్యాయ బద్ధంగా వాటా ప్రకారం ఏపీకి రావాల్సినవే ఇస్తున్నారని.. దీనిలో ఎందుకు యాగీ చేస్తున్నారని కూడా ప్రశ్నించారు. అంతేకాదు.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ ముఖ్యమంత్రు లు తమ బొమ్మలు వేసుకోవడం లేదా? అని నిలదీశారు. దీంతో అప్పట్లో ఈ వివాదం కొంత సర్దుమణిగిం ది.
కట్ చేస్తే.. ఇప్పుడు సీఎం జగన్ ఏం చేస్తారు? అనేది ఆసక్తిగా మారింది. ఎందుకంటే.. కీలకమైన ఎన్నికల సమయంలో అనేక పథకాలను నిర్విఘ్నంగా సాగాలంటే.. కేంద్రం నుంచి ఆర్థిక సాయం అవసరం. పైగా. వివాదాలు పెట్టుకుంటే ఎన్నికల్లోనూ నష్టం. సో.. ఏం చేయాలనే దానిపై సీఎం జగన్ తర్జన భర్జన పడుతున్నట్టు తెలిసింది. పోరాడితే నష్టం.. పోరాడకపోయినా నష్టం.. దీంతో మధ్యేమార్గంగా ముందుకు సాగాలని నిర్ణయించినట్టు సమాచారం. మరి ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on November 8, 2023 1:03 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…