Political News

ష‌ర్మిల క్యామెడీ పాలిటిక్స్‌

దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌రెడ్డి కుమార్తె, ఏపీ సీఎం జ‌గ‌న్ సోద‌రి, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్య‌క్షు రాలు వైఎస్ రాజ‌కీయాలు క్యామెడీగా మారాయా? వైఎస్ కుటుంబం నుంచి కీల‌క నాయ‌కులు వ‌చ్చి.. ప్ర‌జ‌ల‌తో జై కొట్టించుకున్నారు. కానీ, ష‌ర్మిల మాత్రం ప్ర‌జాక్షేత్రంలో పోటీకి దూరం అంటూ.. కేసీఆర్ కోస‌మే తాను పోటీ నుంచి విర‌మించుకున్నాన‌ని చెబుతుండ‌డం.. అదేస‌మ‌యంలో కాంగ్రెస్ నేత‌, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై ప‌రోక్ష విమ‌ర్శ‌లు చేయ‌డం వంటివి తెలంగాణ స‌మాజాన్ని న‌వ్వుకునేలా చేస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

తెలంగాణ‌లోనూ రాజ‌న్న రాజ్యం తెస్తానని, తాను తెలంగాణ గ‌డ్డ‌కు కోడ‌లిన‌ని ప‌దే ప‌దే చెప్పుకొని ప్ర‌జ‌ల నుంచి సింప‌తీ గెయిన్ చేయాల‌ని ప్ర‌య‌త్నించిన ష‌ర్మిల పాద‌యాత్ర కూడా చేశారు. అయితే.. అర్థంత‌రంగా దీనిని నిలుపుద‌ల చేయ‌డం తెలిసిందే. స‌మ‌స్య‌లు ప్ర‌స్తావించాల్సిన చోట రాజ‌కీయాలు ప్ర‌స్తావించి అభాసుపాల‌య్యార‌నే వాద‌న కూడా ఉంది. ముఖ్యంగా పాలేరు నుంచి తాను పోటీకి సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించి.. భారీ ఎత్తున ప్ర‌చారం చేశారు. ఆమెకు పార్టీలోని కొంద‌రు ల‌క్ష‌ల రూపాయ‌లు ఖ‌ర్చు చేసి క‌టౌట్లు ఏర్పాటు చేశారు.

తీరా ఎన్నిక‌ల స‌మ‌యానికి ఆమె కాంగ్రెస్ కు మ‌ద్ద‌తిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించి కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌కు హ్యాం డిచ్చారు. ఇది స‌రే. ఇక‌, కాంగ్రెస్‌కు మ‌ద్ద‌తిచ్చినా.. సీఎం సీటు విష‌యంలో రేవంత్‌రెడ్డికి వ్య‌తిరేకంగా దొంగ‌లు సీఎం కాకూడ‌దు అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం దుమారం రేపింది. ఒక పార్టీకి మ‌ద్ద‌తిచ్చే ముందే.. అన్నీ ఆలోచించుకోవాలి. మ‌రి ఈ విష‌యంలో ష‌ర్మిల ఏం చేసిన‌ట్టు? అనే ప్ర‌శ్న తెర‌మీదికి వ‌చ్చింది. ఇక‌, ఏపీ విష‌యంపైనా ష‌ర్మిల సంబంధం లేద‌ని తేల్చేశారు.

వాస్త‌వానికి సీఎం జ‌గ‌న్ సొంత అన్న‌. ఆయ‌న కోసం పాద‌యాత్ర కూడా చేసింది ష‌ర్మిల‌. కానీ, ఆస్తులు, ప‌ద‌వుల విష‌యంలో త‌లెత్తిన వివాదంతో తెలంగాణ‌కు వెళ్లారు. ఇక‌, అక్క‌డ కూడా చెల్ల‌ని రూపాయిగానే మిగిలిపోయార‌నే వాద‌న వినిపిస్తోంది. ఆమె చేసుకున్న స్వ‌యం కృత అప‌రాధాల‌తో ఇటు ఎన్నిక‌ల‌కు, అటు ప్ర‌జ‌ల‌కు కూడా దూర‌మ‌య్యార‌ని అంటున్నారు. వైఎస్ కుటుంబం నుంచి ఆయ‌న భార్య విజ‌య‌ల‌క్ష్మి, సోద‌రుడు వివేకానంద‌రెడ్డి, త‌న‌యుడు జ‌గ‌న్ రాజ‌కీయాల్లో రాణించారు. గెలుపు గుర్రం ఎక్కారు. కానీ, ష‌ర్మిల మాత్రం వైఎస్ ఫొటో పెట్టుకుని రాజ‌కీయాల‌ను క్యామెడీ చేశార‌ని అంటున్నారు వైఎస్ అభిమానులు.

This post was last modified on November 7, 2023 8:50 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

ప్రేక్షకుల అటెండెన్సుకి ఎవరిది బాధ్యత

చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…

20 mins ago

కోరుకోని చిక్కులో రష్మిక మందన్న

యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…

1 hour ago

హర్యానా : కమలం ‘చే’జారేనా ?

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలలో 370కి పైగా స్థానాలు సాధించి హ్యాట్రిక్ విజయంతో అధికారం చేజిక్కించుకోవాలన్న కమలం ఆశలమీద ఆయా…

2 hours ago

ఆ భూమి జూనియర్ ఎప్పుడో అమ్మేశాడు !

ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ జూబ్లీహిల్స్ లో కొన్న 681 గజాల స్థలం విషయంలో వివాదం నెలకొందని, ఆ స్థలం…

3 hours ago

సోనియ‌మ్మ‌.. సెంటిమెంటు రాహుల్‌ను కాపాడుతుందా?

రాజ‌కీయాల్లో సెంటిమెంటుకు ఛాన్స్ ఎక్కువ‌. ఉద్ధండ నాయ‌కుల నుంచి చ‌రిత్ర సొంతం చేసుకున్న పార్టీల వ‌ర‌క కూడా సెంటి మెంటుకు…

4 hours ago

“వైసీపీకి ప్ర‌తిప‌క్ష హోదా కూడా ద‌క్క‌క‌పోవ‌చ్చు”

వైసీపీ నాయ‌కులు స‌హా స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్నారెడ్డి క‌ళ్ల‌లో భ‌యం క‌నిపిస్తోంద‌ని ఆ పార్టీ రెబ‌ల్ ఎంపీ, ఉండి నుంచి…

11 hours ago