తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నెల 3 నుంచే ఈ ప్రక్రియ ప్రారంభమైనప్ప టికీ.. ముహూర్తాలు, సెంటిమెంటు, రోజులు, వారాలు, వర్జ్యాలు చూసుకుని అభ్యర్తులు నామినేషన్లు వేస్తున్నారు. ఇక, ఎప్పటి లాగానే మందీ మార్బలంతో బల నిరూపణలు కూడా చేసుకుంటున్నారు. అయితే.. ఎవరైనా పిలిచారో.. లేక పిలవకుండానే వచ్చారో.. తెలియదు కానీ, తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి నామినేషన్ పర్వానికి జనం ప్రభంజనంగా పోటెత్తారు.
వందలు వేలు కాదు.. ఏకంగా లక్షల సంఖ్యలో ప్రజలు ఈ నామినేషన్ ఘట్టానికి తరలి రావడం సోషల్ మీడియాను కుదిపేస్తోం ది. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. రేవంత్‌రెడ్డి సోమవారం నామినేషన్ వేశారు. తనకు సంప్రదాయంగా వస్తున్న కొడంగల్ నియోజకవర్గం నుంచి ఆయన ఈ సారి కూడా పోటీకి దిగుతున్నారు. గత ఎన్నికల్లో మాత్రం ఆయన ఇక్కడ ఓడిపోయారు. పైగా అప్పటి ఎన్నికల వేళ.. ఆయన ఇంట్లో పోలీసుల సోదాలు జరిగిన విషయం గుర్తుండే ఉంటుంది. అప్పట్లో ఆయన టీడీపీలో ఉన్నారు.
ఇదిలావుంటే, తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న ఆయన కొడంగల్ అబ్యర్థిగా నామినేషన్ వేసేందుకు రాగా.. ఆయనను అనుసరిస్తూ.. భారీ ఎత్తున ప్రజలు, కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పోటెత్తారు. సుమారు నిమిషం పాటు ఉన్న ఈ వీడియోలో ఎటు చూసిన జనమే కనిపిస్తున్నారు. కాంగ్రెస్ జెండాలతో రోడ్లు, ఫుట్‌పాత్‌లు కూడా నిండిపోయారు. మొత్తానికి కొండల్ జనసంద్రంగా మారిపోయింది. ఇదిలావుంటే.. బీఆర్ ఎస్ మంత్రి కేటీఆర్ మాత్రం కొడంగల్‌లో రేవంత్‌ను మట్టికరిపిస్తామని వ్యాఖ్యలు చేసిన మరునాడే.. రేవంత్‌కు మద్దతుగా ఈ రేంజ్‌లో జనాలు రావడం రాజకీయంగా చర్చనీయాంశం అయింది.
రేవంత్ ఆస్తులు-అప్పులు ఇవీ..
కొడంగల్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన రేవంత్ రెడ్డి ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో తన ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించారు.
This post was last modified on November 6, 2023 11:09 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…