Political News

ఇలా చేరిక అలా టికెట్‌.. కూక‌ట్‌ప‌ల్లి జ‌న‌సేన అభ్య‌ర్థి ఈయ‌నే!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎట్ట‌కేల‌కు పోటీకి రెడీ అయిన‌.. జ‌న‌సేన‌లో టికెట్ల కేటాయింపు కూడా ఊపందుకుంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు అస‌లు పోటీ చేయాలా? వ‌ద్దా? అనే మీమాంస నుంచి బ‌య‌ట ప‌డి.. బీజేపీతో చేతులు క‌లిపి.. 9 స్థానాల‌ను ద‌క్కించుకుని.. వాటిలో పోటీకి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ రెడీ అయ్యారు. ఈ క్ర‌మంలో తాజాగా ఆయ‌న కీల‌క‌మైన కూక‌ట్‌ప‌ల్లి స్థానం నుంచి అభ్య‌ర్థిని ఖ‌రారు చేశారు. హైదరాబాద్ కి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి, వెస్ట్ జోన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్‌ను ప‌వ‌న్ ప్ర‌క‌టించారు.

ఆర్థికంగా బలంగా ఉండ‌డంతోపాటు.. సామాజిక వ‌ర్గం ప‌రంగా కూడా ప్రేమ్‌కుమార్ కు కూక‌ట్ ప‌ల్లి వంటి కీల‌క టికెట్ ఇవ్వ‌డంతో జ‌న‌సేన‌లో జోష్ పెరుగుతుంద‌నే వాద‌న వినిపిస్తోంది. ప్ర‌స్తుతం మంగ‌ళ‌గిరిలో ఉన్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ప‌లువురు తెలంగాణ‌కు చెందిన నాయ‌కుల‌ను కూడా పార్టీలో చేర్చుకున్నారు. సినీ నటుడు సాగర్, భద్రాద్రి కొత్తగూడెనికి చెందిన వ్యాపారవేత్త లక్కినేని సురేందర్ రావు తదితరులు జనసేనలో చేరారు. ఈ సంద‌ర్భంగానే కూకట్ పల్లి నుంచి జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ని ప్రకటించారు.

త్వ‌ర‌లోనే మిగిలిన అభ్య‌ర్తుల‌ను కూడా ప్ర‌క‌టించ‌నున్న ప‌వ‌న్ చెప్పారు. మొత్తం 9 స్థానాల‌కే ప‌రిమిత‌మైన నేప‌థ్యంలో పార్టీ విష‌యంలో అంకిత భావం చూపే వారికే టికెట్లు ఇచ్చే అవ‌కాశం ఉంద‌నేచ‌ర్చ‌సాగుతోంది. అయితే.. ఇలా పార్టీలో చేరిన వ్య‌క్తికి అలా టికెట్ ప్ర‌క‌టించ‌డంపై జ‌న‌సేన‌లోనూ చ‌ర్చ‌సాగుతోంది. అయితే, ప్రేమ్‌కుమార్‌కు ప‌వ‌న్‌కు మ‌ధ్య స్నేహం ఉంద‌ని.. ఎప్ప‌టి నుంచో ఇద్ద‌రి మ‌ధ్న ప‌రిచ‌యం కూడా ఉంద‌ని అందుకే టికెట్ ఇచ్చి ఉంటార‌ని కొంద‌రు చెబుతున్నారు. ఏదేమైనా.. కూక‌ట్‌ప‌ల్లిలో బీఆర్ ఎస్ అభ్య‌ర్థికి దీటుగా ప్రేమ్‌కుమార్ పోటీ ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

This post was last modified on November 6, 2023 9:26 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

లేడీ డాన్లకు వార్నింగ్ ఇచ్చిన సీఎం

ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…

20 minutes ago

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

58 minutes ago

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

1 hour ago

శివన్న డెడికేషనే వేరు

తెలంగాణ‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…

2 hours ago

పర్ఫెక్షన్లో రాక్షసుడు జక్కన్న

బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…

3 hours ago

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

5 hours ago