తెలంగాణలో వైఎస్ షర్మిల వైఎస్సార్టీపీ పార్టీ పెట్టడంపై గతంలో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. షర్మిల పార్టీతో తమకు సంబంధం లేదని, పార్టీ వద్దని చెప్పినా షర్మిల వినలేదని గతంలో సజ్జల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ క్రమంలోనే తాజాగా కాంగ్రెస్ పార్టీకి షర్మిల మద్దతిస్తున్న నేపథ్యంలో మరోసారి షర్మిలపై సజ్జల విమర్శలు గుప్పించారు. దీంతో, తాజాగా సజ్జల వ్యాఖ్యలపై షర్మిల కౌంటర్ ఇచ్చారు.
సజ్జలకు తెలంగాణ రాజకీయాలతో ఏం పని అని షర్మిల ప్రశ్నించారు. గతంలో వైఎస్సార్టీపీతో సంబంధం లేదన్న సజ్జల ఇప్పుడు ఏం సంబంధం ఉందని విమర్శలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఏపీ రాజకీయాల గురించి సజ్జల చూసుకోవాలని, తమ పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని అన్నారు. మీకేం సంబంధం..మీ పని మీరు చూసుకోండి అంటూ చురకలంటించారు.
ఇక, కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని కేసీఆర్ అమాంతం పెంచేశారని షర్మిల ఆరోపించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆ ప్రాజెక్టు వ్యయం 38 వేల కోట్ల రూపాయలని, కానీ, కేసీఆర్ దానిని లక్షా 20 వేల కోట్లకు పెంచారని ఆరోపించారు. కేవలం 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు ఇచ్చేందుకు ఇంత వ్యయం పెంచాల్సిన అవసరం ఏముందని షర్మిల ప్రశ్నించారు. ప్రాజెక్టులో అవసరం లేని చోట కూడా మోటర్లు బిగించారని షర్మిల ఆరోపించారు.
This post was last modified on November 6, 2023 4:39 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…