తెలంగాణ ఎన్నికలు వచ్చినప్పుడల్లా ప్రాంతీయ పార్టీ వాదం, తెలంగాణ సెంటిమెంట్ ను వాడుకోవడం కేసీఆర్ కు అలవాటే.. ఇదీ ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. జాతీయ పార్టీలకు, ఢిల్లీ నేతలకు గులాం కొట్టాల్సిన అవసరం తెలంగాణ ప్రజలకు లేదని, ప్రాంతీయ పార్టీలకే పట్టం కట్టాలని కేసీఆర్ చెబుతూనే ఉంటారు. తాజాగా మరోసారి కేసీఆర్ అదే మాట స్పష్టం చేశారు. ప్రాంతీయ పార్టీలే రక్ష అని.. బీఆర్ఎస్ ను గెలిపించుకోవాలన్నారు. కానీ ఇక్కడ కేసీఆర్ ఓ లాజిక్ మిస్సయ్యారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా జాతీయ పార్టీగా మారింది కదా అనే విషయాన్ని కేసీఆర్ మర్చిపోయారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
2014, 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ గా పోటీపడ్డ కేసీఆర్ పార్టీ.. ఇప్పుడు బీఆర్ఎస్ గా బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే. గత రెండు ఎన్నికల్లో అంటే టీఆర్ఎస్ కేవలం తెలంగాణకే పరిమితం కాబట్టి ప్రాంతీయ పార్టీ పేరుతో కేసీఆర్ సాగిపోయారు. కానీ ఇప్పుడు భారత రాష్ట్ర సమితిగా మారిన పార్టీ జాతీయ స్థాయిలో ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రంలో వరుసగా రెండు సార్లు అధికారంలోకి రావడంతో ఇక జాతీయ రాజకీయాలపై కేసీఆర్ ఫోకస్ పెట్టినట్లే కనిపించారు. ఫెడరల్ ఫ్రంట్ అంటూ బీజేపీ కూటమి, కాంగ్రెస్ కూటమి కాకుండా మూడో ఫ్రంట్ కోసం కేసీఆర్ ప్రయత్నాలు చేశారు. జాతీయ స్థాయిలో వివిధ పార్టీల నేతలను కలిశారు. కానీ అవేవీ కలిసి రాకపోవడంతో సైలెంట్ అయిపోయారు.
ఆ తర్వాత తానే సొంతంగా జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకుని టీఆర్ఎస్ ను కాస్తా బీఆర్ఎస్ గా మార్చారు. ఇప్పుడు మహారాష్ట్రలో పార్టీ ఉనికిని విస్తరించేందుకు విపరీతమైన ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీని జాతీయ పార్టీగా మార్చేందుకు తీవ్రంగా కష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ ను మళ్లీ ప్రాంతీయ పార్టీగా కేసీఆర్ పేర్కొనడం ఏమిటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దిల్లీ కేంద్రంగా సాగే కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణకు ఏమీ చేయలేవని, ఢిల్లీలో స్విచ్ వేస్తే ఇక్కడ లైట్లు వెలుగుతాయని కేసీఆర్ అన్నారు. అందుకే బీఆర్ఎస్ కు ఓట్లు వేయాలని కోరారు. దీంతో జాతీయ పార్టీగా బీఆర్ఎస్ కథ కంచికేనా? అని విశ్లేషకులు అంటున్నారు. లేదా ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీగా ముద్ర కొనసాగించి.. ఆ తర్వాత మళ్లీ జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెడతారా? అన్నది చూడాలి.
This post was last modified on November 6, 2023 9:07 pm
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…
కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా నడుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…
బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం ఒక్కసారిగా రాజకీయ చర్చకు వేదికగా మారింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి మంత్రి…
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…