తెలంగాణా మొత్తంమీద కామారెడ్డి నియోజకవర్గంలో పోటీ హోరెత్తిపోబోతోందా ? అవుననే అంటున్నాయి కాంగ్రెస్ పార్టీ వర్గాలు. పార్టీవర్గాల సమాచారం ప్రకారం కామారెడ్డిలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోటీచేయబోతున్నారు. 10వ తేదీన నామినేషన్ వేయబోతున్నారు. ఇప్పటికే కొడంగల్లో పోటీకి రెడీ అయిన రేవంత్ రెండో నియోజకవర్గంగా కామారెడ్డిలో పోటీకి రెడీ అవుతున్నారట. రేవంత్ పోటీకి కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. ఇక్కడ రేవంత్ పోటీచేస్తే రాష్ట్రమంతా ఎందుకు హోరెత్తిపోతుంది ?
ఎందుకంటే ఇక్కడనుండే కేసీయార్ కూడా పోటీచేయబోతున్నారు కాబట్టే. కేసీయార్ కూడా రెండు నియోజకవర్గాలు గజ్వేలు, కామారెడ్డిలో పోటీచేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే గజ్వేలులో నామినేషన్ వేశారు. ఇక కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేయాల్సుంటుంది. గతంలో కేసీయార్ ఎప్పుడూ రెండు నియోజకవర్గాల్లో పోటీచేసింది లేదు. రెండు నియోజకవర్గాల్లో పోటీచేసినా గెలుపుకు ఢోకాలేదని, బీఆర్ఎస్ విజయం ఖాయమని జనాలందరికీ చాటి చెప్పేందుకే కేసీయార్ రెండుచోట్ల నుండి పోటీచేస్తున్నారు.
తాజా పరిణామాల ప్రకారం కామారెడ్డిలో కేసీయార్-రేవంత్ పోటీ ఖాయమైపోయింది. దాంతో ఈనియోజకవర్గంలో బిగ్ ఫైట్ తప్పదనే ప్రచారం మొదలైంది. గ్రౌండ్ రిపోర్టు ప్రకారమైతే బీఆర్ఎస్ మీద జనాల్లో వ్యతిరేకత ఉంది. గల్ఫ్ దేశాల్లో చనిపోయిన వాళ్ళ బాధిత కుటుంబాలు, కొందరు గిరిజనులు కేసీయార్ పై బాగా మండిపోతున్నారు. తమకిచ్చిన హామీలను కేసీయార్ తుంగలో తొక్కేశారని తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అలాగే వివిధ పథకాల్లో లబ్దిదక్కని జనాలు కూడా కోపంగా ఉన్నారు. అర్హులైన తమను కాదని అనర్హులకు పథకాలు వర్తింపచేస్తున్నారని బాగా కోపంతో ఉన్నారు.
వీళ్ళంతా ఒకఎత్తయితే కామారెడ్డి మున్సిపాలిటి పరిధిలోని రైతులు కూడా బాగా కోపంతో ఉన్నారు. తమ భూములను మున్సిపల్ అధికారులు మాస్టర్ ప్లాన్ పేరుతో ఏకపక్షంగా తీసేసుకున్నారంటు గోలచేస్తున్నారు. మాస్టర్ ప్లాన్ ను రద్దుచేయకపోతే తాము కూడా నామినేషన్లు వేస్తామంటు ఎప్పటినుండో హెచ్చరిస్తున్నారు. అయితే వీళ్ళ హెచ్చరికలను కేసీయార్ ఏమాత్రం లెక్కచేయలేదు. ఇలా వివిధ వర్గాలు అనేక కారణాలతో కేసీయార్ అంటే మండిపోతున్నారు. వీళ్ళంతా ఏకతాటిపైకి వచ్చి మద్దతు పలికితే రేవంత్ ఇక్కడ గెలిచినా ఆశ్చర్యపోవక్కర్లేదు.
This post was last modified on November 6, 2023 10:01 am
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…
సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…
టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…
సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…
అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…