“నాకు తిరుగులేదు.. నేను చెప్పిందే వేదం” అంటూ.. పదే పదే చెప్పుకొనే వైసీపీ నాయకుడు, ఉమ్మడి గుంటూరు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు ఆయన వ్యవహార శైలే ఇప్పుడు పెద్ద కష్టంగా మారింది. మరో ఐదు మాసాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే బొల్లాకు వ్యతిరేకంగా.. సొంత పార్టీ నాయకులే చక్రం తిప్పుతున్నారు. బొల్లా వద్దు.. సుధ ముద్దు! అంటూ.. నాయకులు ప్రచారం చేస్తున్నారు.
2019 ఎన్నికల్లో వినుకొండ నియోజకవర్గం నుంచి స్థానికుడైన బొల్లాకు వైసీపీ అధినేత జగన్ టికెట్ ఇచ్చారు. ఆ సమయంలో అందరినీ కొలుపుకొని పోయిన బొల్లా.. టీడీపీ నేత, అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులపై అతి కష్టం మీద గెలుపు గుర్రం ఎక్కారు. ముఖ్యంగా బొల్లా విజయానికి రెడ్డి సామాజిక వర్గం ఎంతో కష్టపడి పనిచేసింది. అయితే.. బొల్లా ఎమ్మెల్యే అయ్యాక.. ఈ సామాజిక వర్గాన్ని పక్కన పెట్టారనే టాక్ రెడ్డి వర్గం నుంచి బాహాటంగానే వినిపిస్తోంది.
రెడ్డి వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం.. స్థానిక నేతలపై కేసులు పెట్టించడం.. వారిని కనీసం పట్టించుకోకపోవడం వంటివి బొల్లాకు ఇప్పుడు సెగ పెంచేస్తున్నాయి. దీంతో రెడ్డి వర్గం.. ముక్తకంఠంతో బొల్లాకు వ్యతిరేకంగా చక్రం తిప్పుతున్నాయి. “బొల్లా బ్రహ్మనాయుడు.. మాకు అవసరం లేదు. ఆయన వల్ల ఏం జరిగింది? నియోజకవర్గానికి ఆయన ఏం చేశారు? ఆయనను గెలిపించేందుకు ఎంతో కష్టపడిన మాకు ఏం ఒరగబెట్టారు” అని రెడ్డి వర్గం బాహాటంగానే వ్యాఖ్యానిస్తోంది.
ఈ క్రమంలోనే 2014 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన నన్నపనేని సుధను తెరమీదికి తెచ్చారు. నన్నపనేని సుధకు టికెట్ ఇవ్వాలని.. ఆమెను గెలిపించుకుంటామని రెడ్డి వర్గం చెబుతోంది. అంతేకాదు.. బొల్లాకు టికెట్ ఇస్తే.. సహకరించేది లేదని కూడా రెడ్డి వర్గం తెగేసి చెబుతోంది. ఇక, సుధ కూడా.. మళ్లీ యాక్టివ్ అయ్యారు.
ఈమె భర్త సతీష్‌రెడ్డి.. సీఎం జగన్ కు సమీప బంధువు కావడం.. 2014లో పోటీ చేసి ఓడిపోయిన సానుభూతి ఉండడంతో ఈ దఫా ఆమెకే టికెట్ ఇవ్వాలనేది రెడ్డి వర్గం డిమాండుగా ఉంది. ఏదేమైనా బొల్లా ఒంటెత్తు పోకడలు, రెడ్డి వర్గం పై ఆధిపత్యం చలాయించడం.. వారిని కనీసం పట్టించుకోకపోవడం వంటివి ఇప్పుడు ఆయన టికెట్‌కు ఎసరు పెడుతున్నారనే చర్చ జోరుగా సాగుతుండడం గమనార్హం.
This post was last modified on November 5, 2023 2:39 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…