మాకు సంబంధం లేదు.. ఆమె పార్టీ ఏపీకి చెందింది కాదు.. అంటూనే వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఓ రేంజ్‌లో వ్యాఖ్యలు గుప్పించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో షర్మిల పార్టీ పోటీకి దూరంగా ఉంటూ.. కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ పరిణామం ఏపీ అధికార పార్టీకి మింగుడు పడడం లేదు. ముఖ్యంగా షర్మిల జగన్‌కు అస్సలు కంటిపై కునుకు లేకుండా చేస్తోందనే చెప్పాలి.
ఎందుకంటే.. కాంగ్రెస్ తమకు తొక్కేసే ప్రయత్నం చేసిందని..తనను సీఎం కాకుండా చేసిందనే వాదన జగన్ మనసులో ఉన్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి కూడా చెప్పుకొచ్చారు. “జగన్మోహన్‌రెడ్డిని ఏ పార్టీ వేధించి అక్రమ కేసులు పెట్టారో ఆ పార్టీతో షర్మిల కలిశారు. షర్మిల ఓ పార్టీకి అధ్యక్షురాలు.. ఆమె నిర్ణయాలు ఆవిడ ఇష్టం. మాకు ఈ రాష్ట్రానికి చెందిన విషయాలే ముఖ్యం. కాంగ్రెస్ పార్టీ వైఎస్సార్ కుటుంబాన్ని వేధించింది.. ఇబ్బందులు పెట్టిందని అందరికీ తెలుసు. జగన్‌పై అక్రమ కేసులు పెట్టి కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెట్టింది” అని సజ్జల వ్యాఖ్యానించారు.
ఏం జరుగుతుంది?
వాస్తవానికి ఇప్పటికే షర్మిల పార్టీ పెట్టడం.. తెలంగాణలో పావులు కదపడాన్ని వైసీపీ జీర్ణించుకోలేక పోతున్న విషయం తెలిసిందే. షర్మిల పార్టీ పెట్టిన సమయంలోనూ.. అసలు వద్దని ఇదే సజ్జల చెప్పుకొచ్చారు. అయినప్పటికీ షర్మిల పార్టీ పెట్టారు. ఒకానొక సందర్భంలో షర్మిల అరెస్టు.. పోలీసులతో రగడ వ్యవహారం కూడా ఏపీ సర్కారును ఇరకాటంలోకి నెట్టంది. మొత్తంగా షర్మిల మాత్రం వెనక్కి తగ్గలేదు. ఇక, ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు. ఇవన్నీ ఇలా ఉంటే.. 2019 ఏపీలో జరిగిన ఎన్నికల తర్వాత.. షర్మిల-జగన్‌ల మధ్య విభేదాలు ఏర్పడిన విషయం తెలిసిందే. రాజకీయంగా, ఆస్తుల పరంగా కూడా ఇద్దరి మధ్య పొరపొచ్చాలు ఏర్పడిన విషయం తెలిసిందే. తాజా పరిణామాల నేపథ్యంలో సోదరసోదరీమణుల మధ్య మరిన్ని విభేదాలు రావడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on November 4, 2023 9:54 am
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…