ముల్లును ముల్లుతోనే తీయాలన్నది రాజనీతి. ఈ నీతిని తెలంగాణా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికార బీఆర్ఎస్ పార్టీ పైన ప్రయోగం చేయాలని ప్లాన్ చేస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే బీఆర్ఎస్ ఎన్నికల గుర్తు కారు అన్న విషయం తెలిసిందే. ఇపుడు అదే గుర్తుతో కేసీయార్ వ్యతిరేక ప్రచారం చేయాలని కాంగ్రెస్ రెడీ అవుతోంది. అది ఎలాగంటే రాష్ట్రవ్యాప్తంగా సుమారు 119 కార్లను కాంగ్రెస్ అద్దెకు తీసుకోబోతోంది. వాటిని గులాబీ రంగుతోనే ముస్తాబు చేయబోతోంది. అంటే అప్పుడు ఆ కార్లు చూడడానికి అచ్చం బీఆర్ఎస్ పార్టీ గుర్తులాగే ఉంటుంది.
అయితే దానిపై బైబై కేసీయార్ అనే నినాదాన్ని రాయించాలని కాంగ్రెస్ డిసైడ్ అయ్యింది. అంతేకాకుండా కారుగుర్తుపై కాళేశ్వరంలో అవినీతి, దళితబంధు, బీసీ బంధు స్కీమ్ ఫెయిల్యూర్, టీఎస్ పీఎస్సీ పేపర్ల లీకేజి, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పాత్ర, రైతు రుణమాఫీలో మోసం పథకాలను, తప్పుడు హామీలను రాయించాలని డిసైడ్ అయ్యిందట. కేసీయార్ వ్యతిరేక స్లోగన్లు రాయించిన కారులో కేసీఆర్ వ్యతిరేక ప్రచారానికి సంబంధించిన కేసెట్ ను ఏర్పాటు చేయబోతోంది.
అంతా రెడీ అయిన తర్వాత ఆ కారు దానికి కేటాయించిన నియోజకవర్గాల్లో తిరుగుతునే ఉంటుంది. ఎన్నికల ప్రచారం ముగిసేంతవరకు కార్లు ప్రతిరోజు నియోజకవర్గాల్లో తిరుగుతునే ఉంటుందని పార్టీ వర్గాలు చెప్పాయి. మామూలు జనాలకు చూసేందుకు బీఆర్ఎస్ గుర్తయిన కారు తిరుగుతున్నట్లే ఉంటుంది. కానీ అందులో కేసీయార్ వ్యతిరేక ప్రచారం జరుగుతుంటుంది. జనాలను తమ ప్రయోగం బాగా ఆకర్షిస్తుందని కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారు.
అయితే దీంతో సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే కారులో కేసీయార్ వ్యతిరేక ప్రచారం జరుగుతుంటే పోలీసులు చూస్తూ ఊరుకుంటారా ? పోలీసులు ఎంత ఎన్నికల కమీషన్ ఆధీనంలో ఉన్నా అధికారపార్టీ నేతలు చెప్పిన మాట వినకుండానే ఉంటారా ? అన్నది పాయింట్. ఏదేమైనా కాంగ్రెస్ ప్రయత్నం ఆచరణలోకి వస్తే కానీ గ్రౌండ్ రియాలిటీ ఏమిటో తెలియటం లేదు. ప్లాన్ అయితే బాగానే ఉంది మరి ఫలితమే అనుమానంగా ఉంది.
This post was last modified on November 4, 2023 9:47 am
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…