వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలకు సొంత పార్టీ నాయకుల నుంచి భారీ సెగ తగిలింది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పోటీ చేసేదీ చేయనిదీ.. షర్మిల స్పష్టం చేయకపోవడం.. నామినేషన్లకు గడువు వచ్చేయడం.. మరోవైపు ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థులను ఖరారు చేస్తున్న నేపథ్యంలో షర్మిల పార్టీలో ఉలుకు పలుకు లేకుండా పోయింది. దీనికితోడు.. భిన్నమైన వాదనలను పార్టీ కార్యాలయం మీడియాకు లీక్ చేస్తోంది.
ఈ పరిణామాలతో షర్మిల పార్టీలోని కొందరు నాయకులు కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. షర్మిల తమను నమ్మించి నట్టేట ముంచిందని వారు తీవ్ర విమర్శలు గుప్పించారు. అంతేకాదు.. అసలు పార్టీ ఎందుకు పెట్టారో.. చెప్పాలంటూ నిలదీశారు. తమను పావులుగా వాడుకుని.. ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని నమ్మించి.. ఖర్చు చేయించి ఇప్పుడు మొహం చాటేస్తారా? అంటూ.. కొందరు నాయకులు ప్రశ్నిస్తున్నారు.
ఏం జరిగింది?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షర్మిల పార్టీ వైఎస్సార్ టీపీ రెడీ అయినట్టు మూడు మాసాల కిందట ప్రచారం చేశారు. మొత్తం 119 నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులను ప్రకటిస్తామని కూడా చెప్పారు. అయితే.. ఇంతలోనే.. కాంగ్రెస్‌కు చేరువయ్యారు. పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే.. ఈ ప్రతిపాదన ఎందుకో ఆగిపోయింది. ఆ తర్వాత మళ్లీ గత కొద్ది రోజులుగా రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పోటీలో ఉంటామని ప్రకటించారు.
చివరగా గత రెండు రోజుల కింద జరిగిన ఉన్నత స్థాయి కార్యకర్త సమావేశంలో 50 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ ప్రకటించింది. అయితే.. గత సాయంత్రం అంతర్గత సమావేశంలో తెలంగాణలో పోటీ చేయడం లేదని పార్టీ ముఖ్య నాయకులు చెప్పినట్టు సమాచారం. దీంతో టికెట్లపై ఆశలు పెట్టుకున్నవారు పార్టీ కార్యాలయానికి చేరుకుని షర్మిలపై నిప్పులు చెరుగుతున్నారు. ఆగ్రహానికి గురైన వైయస్సార్టీపీ నాయకులు షర్మిల డౌన్ డౌన్.. వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తున్నారు. మరి వైఎస్ తనయ ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on November 3, 2023 12:29 pm
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…