ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎన్నికలకు ముందు సాధ్యమైనన్ని హామీలు నెరవేర్చేందుకు అధికార పార్టీ సన్నాహాలు మొదలుబెట్టింది. ఈ క్రమంలోనే చాలా కాలంగా పెండింగ్లో ఉన్న గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీకి జగన్ సర్కార్ నడుం బిగించింది తాజాగా 900 గ్రూప్ 2 పోస్టులు, 100 గ్రూప్ 1 పోస్టుల నోటిఫికేషన్లతో కలిపి మొత్తం 23 నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు ఏపీపీఎస్సీ రెడీ అయింది.
డిగ్రీ, పాలిటెక్నిక్, జూనియర్ కాలేజీ లెక్చరర్ పోస్టులతో పాటు పలు రకాల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు ఏపీపీఎస్సీ అధికారులు సిద్ధమయ్యారు. ఈ నెలలోనే 23 నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ ప్రకటించారు. గ్రూప్ 1 పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, ఎంపికలకు సంబంధించి నూతన విధానాన్ని రూపొందించామని గౌతమ్ సవాంగ్ వెల్లడించారు.
ఐఐటీ, హెచ్ సీయూలతోపాటు పలు ప్రముఖ యూనివర్సిటీలోని నిపుణులతో చర్చించి సిలబస్ లో మార్పులు చేశామని వెల్లడించారు. అయితే, ఏపీపీఎస్సీపై ఓ వర్గం మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని, నిరుద్యోగ యువతను ఆందోళనకు గురిచేస్తోందని ఏపీపీఎస్సీ ఖండించింది. గ్రూప్ 2 విషయంలో 900 ఖాళీలకు ఆర్థిక శాఖ ఆమోదం లభించిందని, 54 శాఖల నుంచి జోన్ల వారీగా సమాచారం రావడంలో కొంత జాప్యం జరిగిందని ఏపీపీఎస్సీ వెల్లడించింది.
ముఖ్యంగా అసిస్టెంట్ ప్రొఫెసర్లు, గ్రూప్ 1 గ్రూప్ నోటిఫికేషన్ల జారీపై కొన్ని మీడియా సంస్థలు తప్పుడు కథనాలు ప్రచురించాయని, వాటిని ఏపీపీఎస్సీ ఖండిస్తుందని ప్రకటించింది. అటువంటి కథనాలను నమ్మవద్దని అభ్యర్థులకు సూచించింది. ఈ నెలలోనే మొత్తం 23 నోటిఫికేషన్లు విడుదల చేయబోతున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది.
This post was last modified on November 2, 2023 8:40 pm
ఏపీ నూతన రాజధాని అమరావతికి నూతనోత్తేజం వచ్చేసింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేజిక్కించుకోవడంతోనే అమరావతికి…
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…