తెలంగాణ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఎదగాలని భావించి పలు అవాంతరాలు ఎదుర్కొని వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసే వరకు చేరిన దివంగత సీఎం వైఎస్ తనయ వైఎస్ షర్మిల మరో కీలక నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సర్వం సిద్ధం చేసుకున్నప్పటికీ పలువురు నాయకులు అడ్డుపడిన కారణంగా ఆ ప్రక్రియకు బ్రేక్ పడిందనే వార్తలు వచ్చాయి. అయితే, సదరు నాయకుల ఓటమే లక్ష్యంగా షర్మిల పావులు కదుపుతున్నారని, ఏకంగా ఎన్నికల్లో పోటీ చేయడమనే అంశం కూడా ఇందులో భాగమని అంటున్నారు.
ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పలు సెగ్మెంట్లను లక్ష్యంగా చేసుకొని షర్మిల బరిలో దిగనున్నారు. దాదాపు30–34 సెగ్మెంట్లలో బలమైన అభ్యర్థులను బరిలోకి దించేందుకు ఆమె ప్లాన్ వేస్తున్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లో కాంగ్రెస్ కు పట్టున్న స్థానాలే లక్ష్యంగా ఆమె తన అభ్యర్థులను బరిలోకి దింపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రధానంగా తన ఎంట్రీకి అడ్డుపడ్డట్టుగా భావిస్తున్న పొంగిలేటికి మొదటిగా చెక్ పెట్టే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆమె మొదటి నుంచి చెబుతున్నట్టుగా పాలేరు నుంచే పోటీ చేయనున్నారు. ఇక్కడ దివంగత సీఎం వైఎస్సార్ కు పెద్ద సంఖ్యలో అభిమానులు ఉండటం కలిసొస్తుందని ఆమె భావిస్తున్నారని సమాచారం.
అయితే, కేవలం పొంగులేటి అనే అంశమే కాకుండా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చేందుకు షర్మిల ఏర్పాట్లు చేసుకుంటున్నారని సమాచారం. తాను ఫోకస్ చేసిన సెగ్మెంట్లలో పార్టీలో యాక్టివ్ గా ఉండే నేతలను రంగంలోకి దించి కాంగ్రెస్ విజయావకాశాలను తారుమారు చేసే వ్యూహాన్ని అమలు చేయాలనుకుంటున్నట్టు సమాచారం. తద్వారా తన సత్తా చాటుకొని ఇటు కాంగ్రెస్ పార్టీకి అటు తన విలీనాన్ని అడ్డుకున్న నేతలకు షర్మిల గుణపాఠం చెప్పనున్నారని మాట వినిపిస్తోంది. అయితే, ఇలా చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేలా షర్మిల తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నారని కాంగ్రెస్ శ్రేణులు విశ్లేషిస్తున్నాయి.
This post was last modified on November 2, 2023 12:50 pm
తమిళ జనాలకు మహేంద్రసింగ్ ధోని అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐపీఎల్ ఆరంభం నుంచి ఆ జట్టుకు…
తమిళంలో ఆ మధ్య పెరుసు అనే సినిమా రిలీజయ్యింది. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడింది. తెలుగు డబ్బింగ్ తో పాటు…
గత ఏడాది టీజర్ కొచ్చిన నెగటివ్ రెస్పాన్స్ దెబ్బకు వీడియో ప్రమోషన్లకు దూరంగా ఉన్న విశ్వంభర ఎట్టకేలకు ఇవాళ హనుమాన్…
ఏపీలోని పొలిటికల్ కేపిటల్ విజవాయడలో శనివారం ఓ ఆసక్తికర సన్నివేశం కనిపించింది. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో ఆ…
అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో భారత సంతతికి చెందిన మున్సిపల్ కౌన్సిలర్ ఆనంద్ షా వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై గ్యాంబ్లింగ్ మాఫియా…
ప్రభాస్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్న స్పిరిట్ కు రంగం సిద్ధమవుతోంది. చేతిలో ఉన్న ఫౌజీ, ది రాజా సాబ్…