ఆరు రోజుల క్రితం దుబ్బాక ప్రచారంలో ఉన్న ఎంపీ కొత్త ప్రభాకరరెడ్డిపై ఒక యువకుడు కత్తితో దాడిచేసిన ఘటనకు రాజకీయాలతో సంబంధంలేదని తేలిపోయింది. ఇదే విషయాన్ని సిద్ధిపేట పోలీసు కమీషనర్ శ్వేత స్పష్టంచేశారు. బీఆర్ఎస్ మెదక్ ఎంపీ కొత్త ప్రభాకరరెడ్డి దుబ్బాక ఎంఎల్ఏగా పోటీచేస్తున్న విషయం తెలిసిందే. ప్రభాకరరెడ్డి ప్రచారంలో ఉండగా ఒక యువకుడు కత్తితో దాడిచేశాడు. ఆ దాడిలో ఎంపీకి పొత్తికడుపులో తీవ్రంగా గాయమైంది. ఇపుడు ఆసుపత్రి ఐసీయూలో ఉండి వైద్యం చేయించుకుంటున్నారు.
ఎంపీపై ఎప్పుడైతే దాడి జరిగిందో వెంటనే కేసీయార్, కేటీయార్ మాట్లాడుతు కాంగ్రెస్ పై తీవ్రస్ధాయిలో ఆరోపణలు చేశారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ హత్యారాజీకాయాలకు పాల్పడుతున్నట్లు బహిరంగసభల్లోనే నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఇదే విషయమై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతు జరిగిన దాడిలో తమ పార్టీకి ఎలాంటి సంబంధంలేదని చెప్పారు. దాడిచేసిన యువకుడిపై కేసు నమోదుచేసి యాక్షన్ తీసుకోమని కూడా చెప్పారు.
రేవంత్ ఇంతచెప్పినా కేసీయార్, కేటీయార్ వినిపించుకోలేదు. దాడి విషయాన్ని పదేపదే బహిరంగసభల్లో ప్రస్తావిస్తునే ఉన్నారు. అలాంటిది ఇపుడు కమీషనర్ శ్వేత మాట్లాడుతు కేవలం సెన్సేషనల్ అవ్వటానికే తాను కత్తితో దాడిచేసినట్లు గట్టని రాజు చెప్పినట్లు చెప్పారు. అంటే రాజు దాడికి రాజకీయాలకు ఎలాంటి సంబంధంలేదని కమీషనర్ మాటల్లోనే తేలిపోయింది. రాజు చేసిన దాడికి రాజకీయాలకు సంబంధంలేనపుడు ఇక కాంగ్రెస్ దాడి చేయించిందని చేసిన ఆరోపణలన్నీ అబద్ధాలే అని తేలిపోయినట్లే.
జరిగిన దాడిని అడ్డంపెట్టుకుని కాంగ్రెస్ పైన బురదచల్లటానికి మాత్రమే కేసీయార్, కేటీయార్ అత్యుత్సాహం ప్రదర్శించినట్లు తెలిసిపోతోంది. అనసరంగా కాంగ్రెస్ మీద హత్యారాజకీయాలంటు ఆరోపణలు చేసిన తండ్రి, కొడుకులు ఇపుడు ఏమి సమాధానం చెబుతారో చూడాలి. బట్టకాల్చటం ప్రత్యర్ధుల మీదకు విసిరేయటంలో కేసీయార్, కేటీయార్ కు మించిన వాళ్ళు లేరు. తమలో ఎన్నితప్పులున్నా వాటిని కప్పిపుచ్చుకుని ఎదురు దాడులు చేయటంలో వీళ్ళు ఆరితేరిపోయారు. మరి ఎంపీపైన దాడిని, తమపై చేసిన ఆరోపణల విషయంలో కాంగ్రెస్ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సిందే.
This post was last modified on November 2, 2023 10:35 am
రాజాసింగ్... రాజకీయాల పట్ల కనీస పరిచయం ఉన్నవారికి ఎవరికైనా ఈ పేరు గురించి, ఈ నాయకుడి గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు.…
వైసీపీ ప్రభుత్వం అండ చూసుకొని సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, వారి కుటుంబ సభ్యులపై అసభ్యరమైన పోస్టులు…
ఈ రోజు సోషల్ మీడియా అంతటా ధనుష్-నయనతార గొడవ గురించే చర్చ. ధనుష్ మీద తీవ్ర విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తూ నయనతార…
ప్రభాస్ తన లైనప్ లో ఎన్ని క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేసినా కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఫోకస్ మాత్రం…
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం వైసీపీ లేని లోటును టీడీపీ ఎమ్మెల్యేలే తీర్చేస్తున్నారు. నిజానికి వైసీపీ ఉంటే కూడా ఇంతగా…