అయితే కేసీఆర్‌తో కాదంటే కాంగ్రెస్‌తో పొత్తులు పెట్టుకునేందుకు ఆది నుంచి ప్రయత్నించిన కమ్యూనిస్టులకు చివరి నిముషంలో ఇరు పక్షాల నుంచి భంగపాటే ఎదరైంది. అటు కేసీఆర్ ఉలకలేదు.. పలకలేదు. మునుగోడులో కమ్యూనిస్టులు సహకరించిన నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో కలసి వెళ్లాలని అనుకున్నారు. అయితే.. కేసీఆర్ చివరకు హ్యాండిచ్చారు. ఇక, తర్వాత అంకంలోకి కాంగ్రెస్ వచ్చినా.. ఆ పార్టీ కూడా కమ్యూనిస్టులతో పొత్తులకు రెడీ కాలేదు. దీంతో ఇప్పుడు తప్పని సరి పరిస్థితిలో కమ్యూనిస్టులు ఒంటరి పోరుకు రెడీ అవుతున్నారు.
ఇందులోనూ సీపీఎం,సీపీఐలు ఎవరికి వారుగా పోటీ పడుతుండడం గమనార్హం. ఈ క్రమంలో సీపీఎం ఖమ్మం జిల్లాలో సొంతంగా పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే.. సత్తుపల్లి మినహా ఖమ్మం, వైరా, మధిర, పాలేరులో సొంతంగా అభ్యర్థులను పోటీకి దింపేందుకు జిల్లా కమిటీ కూడా ఆమోదం తెలిపింది. త్వరలోనే అభ్యర్థులతో పాటు నియోజకవర్గాలకు పార్టీ బాధ్యులను ప్రకటించే అవకాశం ఉంది. అలాగే కీలకమైన పాలేరు నియోజకవర్గంలోనూ పోటీకి సిద్ధపడుతున్నారు.
ఇప్పటికే పాలేరులోని నాలుగు మండలాల్లో ఆయా మండల కమిటీల సమావేశాలు జరిగాయి. ఇక, పాలేరు, ఖమ్మం లాంటి ప్రతిష్టాత్మకమైన జనరల్ స్థానాల్లో సీపీఎం రాష్ట్ర స్థాయిలోని ముఖ్యనాయకులు పోటీ చేస్తే పార్టీకి పటిష్ఠమైన ఓటు బ్యాంకు దక్కుతుందని కామ్రెడ్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు స్థానాలకు కీలక నేతల అన్వేషణ సాగుతోంది. ఇక, సీపీఐ కూడా తన దారిలో తాను ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇల్లెందు, సత్తుపల్లిలో సీపీఐ వంటరి పోరుకు రెడీ అవుతున్నట్టు కమ్యూనిస్టులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ఖమ్మంలో కమ్యూనిస్టుల ప్రభావం ఎంతనేది తేలిపోతుందని అంటున్నారు పరిశీలకులు. వాస్తవానికి ఒకప్పుడు బలమైన పార్టీలుగా ఉన్న కమ్యూనిస్టులు తర్వాత తర్వాత పలచనబడ్డారనే టాక్ ఉంది. ఇక, ఇతర పార్టీలతో పొత్తులకు ప్రయత్నించి.. కేడర్‌లోనూ అసహనం సృష్టించారు. దీంతో ఒంటరిపోరుతో ఏమేరకు లబ్ధి పొందుతారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే.. ఈ ఒంటరి పోరు కమ్యూనిస్టులకు మేలు చేసినా.. చేయకపోయినా.. ప్రధానపార్టీల ఓట్లు చీల్చడం ఖాయమనే వాదన వినిపిస్తుండడం గమనార్హం.
This post was last modified on November 1, 2023 11:04 am
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్‌లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…