Political News

బాబు కోసం బారులు.. ఉప్పొంగిన అభిమానం

రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు హైకోర్టు మ‌ధ్యంత బెయిల్ మంజూరు చేయ‌డంతో ఆయ‌న జైలు నుంచి విడుద‌ల‌య్యారు. ఈ క్ర‌మంలో రోడ్డు మార్గంలో రాజ‌మండ్రి నుంచి గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి మండ‌లం ఉండ‌వ‌ల్లికి బ‌య‌లు దేరారు. చంద్ర‌బాబు జడ్ + కేట‌గిరీ భ‌ద్ర‌త‌లో ఉండ‌డంతో ఆ మేర‌కు పోలీసులు ఏర్పాట్లు చేశారు. అయితే, పార్టీ నాయ‌కుల పిలుపు మేర‌కు ఎక్క‌డిక‌క్క‌డ ప్ర‌జ‌లు చంద్ర‌బాబుకు ఘ‌న స్వాగ‌తం ప‌లికేందుకు బారులు తీరారు.

రాజమండ్రి నుంచి చంద్రబాబు వేమగిరి, రావులపాలెం, పెరవలి, తణుకు, తాడేపల్లిగూడెం, భీమడోలు, దెందులూరు, ఏలూరు, హనుమాన్ జంక్షన్, గన్నవరం, విజయవాడ మీదుగా ఉండవల్లిలోని నివాసానికి చేరుకుంటారు. అయితే, జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ చంద్రబాబును చూడగానే జై బాబు నినాదాలతో అభిమానులు హోరెత్తించారు. పోలీసుల ఆంక్షలను ఛేధించుకొని వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు జైలు వ‌ద్దే ఆయ‌న‌కు ఘ‌నంగాస్వాగ‌తం ప‌లికారు. 52 రోజుల తర్వాత బయటకు వచ్చిన చంద్రబాబునాయుడు పై ఉప్పొంగిన అభిమానంతో హ‌ర్షాతిరేకం వ్య‌క్తం చేశారు.

ఇక‌, చంద్ర‌బాబు వ‌స్తున్న కాన్వాయ్ రోడ్ మ్యాప్ మేర‌కు దారిపొడవునా చంద్రబాబును చూసేందుకు ప్ర‌జ‌లు బారులు తీరారు. రాజ‌మండ్రి స‌హా కాన్వాయ్ ప్ర‌యాణించే ప్ర‌ధాన ర‌హ‌దారుల‌పై టీడీపీ నాయ‌కులు భారీ ఎత్తున బ్యాన‌ర్లు క‌ట్టారు. అంతేకాదు.. ప్ర‌ధాన కూడ‌ళ్ల‌లో వంద‌ల సంఖ్య‌లో అభిమానులు ఆయ‌న కోసం వేచి ఉన్నారు. చంద్ర‌బాబు నినాదాల‌తో రావుల పాలెం సెంట‌ర్ మార్మోగింది. ఇక‌, తాడేప‌ల్లి, భీమ‌డోలు, దెందులూరు, ఏలూరు, గ‌న్న‌వ‌రం, విజ‌య‌వాడల్లో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున చంద్ర‌బాబు కోసం ఎదురు చూస్తుండ‌డం గ‌మ‌నార్హం. బాస్ ఈజ్ బ్యాక్ నినాదాల‌తో హోరెత్తించ‌డంతోపాటు.. జై బాబు నినాదాలు చేస్తున్నారు.

This post was last modified on November 1, 2023 1:08 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

యూరిక్ యాసిడ్ సమస్యలకు జీలకర్రతో ఇలా చెక్ పెట్టండి..

ప్రస్తుతం మనలో చాలామంది తెలిసో తెలియకో ఇబ్బంది పడే సమస్యలలో యూరిక్ యాసిడ్ పెరుగుదల కూడా ఒకటి. చలికాలంలో ఈ…

2 hours ago

అల్లు అర్జున్ కు మరోసారి లీగల్ నోటీసులు!

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…

10 hours ago

అవసరమైతే విదేశీ డాక్టర్లతో రేవతి కుమారుడు శ్రీతేజ్ కు వైద్యం!

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…

11 hours ago

కరోనా వేళ ప్రభాస్‌తో డైరెక్టర్ శంకర్ చర్చలు!

తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…

12 hours ago

పార్ట్ 2 మంత్రం పని చేయలేనట్టేనా…?

విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…

13 hours ago

వైల్డ్ ఫైర్ ఎఫెక్ట్ : ఆంధ్ర వైపు సంక్రాంతి సినిమాల చూపు!

పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…

14 hours ago