టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై ఎట్టకేలకు స్పందించిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, వైఎస్ ఆత్మగా పేరున్న కేవీపీ రామచంద్రరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్టు వెనుక పెద్ద కథే నడిచిందన్నారు. దీనిని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆడుతున్న నాటకంగా ఆయన పేర్కొన్నారు. “సీఎం జగన్‌ను అడ్డుపెట్టి కేంద్రం ఆడిన నాటకంలో చంద్రబాబు పావుగా మారారు” అని కేవీపీ అన్నారు.
చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ కేంద్రంలోని పెద్దల వ్యూహం ఉందని, అయితే.. దీనిపై మాట్లాడేందుకు కొందరికి ధైర్యం సరిపోవడం లేదని కేవీపీ వ్యాఖ్యానించారు. వైసీపీ అధినేత జగన్‌ను అడ్డుపెట్టుకుని బీజేపీ ఈ దుశ్చర్యకు దిగిందని కేవీపీ చెప్పారు. ఈ వ్యవహారం అందరికీ తెలిసిదేనని, రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెబుతారని అన్నారు. అనేక రోజుల నిరీక్షణ తరవాత టీడీపీ యువనేత నారా లోకేష్‌కు హోంమంత్రి అమిత్‌షా అపాయింట్‌మెంట్ ఇవ్వడమే దీనికి నిదర్శనమని కేవీపీ విమర్శించారు.
మద్యం వద్దని.. ఆదాయం ముద్దని!
సీఎం జగన్ అధికారంలోకి రాకముందు ఒక మాట.. వచ్చిన తర్వాత.. మరోమాటా మాట్లాడుతున్నారని కేవీపీ విమర్శించారు. అన్ని వర్గాలను ఆయన అథోగతి పాలు చేశారని.. ఏ ఒక్క వర్గం కూడా రాష్ట్రంలో సంతోషంగా లేరని కేవీపీ చెప్పారు. రైతులు లబోదిబోమంటున్నా.. సీఎంకు చీమకుట్టినట్టు లేదన్నారు. ఇక, మద్య నిషేధాన్ని విడతల వారీగా అమలు చేస్తానని 2019 ఎన్నికల్లో హామీ ఇచ్చిన జగన్.. దాని ఆదాయాన్ని ఆనందంగా అనుభవిస్తున్నారని వ్యాఖ్యానించారు.
“మద్యం వద్దన్న జగనే.. ఇప్పుడు దానిపై వచ్చే ఆదాయంతో ఆనందం పొందుతున్నారు” అని అన్నారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై సరైన లెక్కలు లేవని, ఈ విక్రయాల్లో నగదే ఎందుకు తీసుకుంటున్నారని వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆరోపణలు వచ్చినా కేంద్రం ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు.
This post was last modified on October 31, 2023 2:32 pm
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…