వైసీపీ పాలనను పొగుడుతూ సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ చేసిన కామెంట్లు రాష్ట్ర రాజకీయాల్లో కాక రేపుతున్న సంగతి తెలిసిందే. దీంతో, వైసీపీలో వీవీ లక్ష్మీ నారాయణ చేరతారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆ ప్రచారంపై ఆయన క్లారిటీనిచ్చారు. ఆ ఊహాగానాలలో ఏ మాత్రం నిజం లేదని, ఇటువంటి ప్రచారాలపై ప్రజలు తమ విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దని తెలిపారు. ఓటర్ల చైతన్య కార్యక్రమం కొనసాగిస్తానని, వైసీపీలో చేరడం లేదని స్పష్టం చేశారు.
శ్రీశైలంలో తన బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుగుతోందని, అదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి గారు శ్రీశైలంలో పర్యటిస్తున్నారని అన్నారు. దీంతో, ఆ కార్యక్రమానికి ఆహ్వానించేందుకే ఎమ్మెల్యేను కలిశానని అన్నారు. అదే సమయంలో వైద్య పరీక్షలకు సంబంధించిన ‘జగనన్న సురక్ష’ కార్యక్రమానికి తనను ఆయన ఆహ్వానించారని చెప్పారు. ఆ సందర్భంగా వైద్య శిబిరాలు, నాడు-నేడు కార్యక్రమాలను అభినందించానని చెప్పుకొచ్చారు.
అంతమాత్రానికే తాను వైసీపీలో చేరుతున్నానని, రాబోయే ఎన్నికల్లో వైసీపీ టిక్కెట్ పై పోటీ చేయబోతున్నానంటూ తప్పుడు వార్తలు ప్రచారం చేయడం సరికాదన్నారు. మరి, ఈ క్లారిటీ తర్వాత వీవీ లక్ష్మీనారాయణ వైసీపీలో చేరతారన్న ప్రచారానికి తెరపడుతుందా లేదా అన్నది వేచి చూడాలి. ఇక, రాబోయే ఎన్నికల్లో విశాఖ ఎంపీగా ఆయన ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే.
This post was last modified on October 30, 2023 7:28 pm
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…