టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు, జైలు పాలైన ఉదంతంపై తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కుమార్తె, ఎమ్మెల్సీ కవిత స్పందిం చారు. చంద్రబాబు అరెస్టు దారుణమని, దురదృష్టకరమని ఆమె వ్యాఖ్యానించారు. కొన్నాళ్ల కిందట మంత్రి కేటీఆర్ కూడా చంద్రబాబు అరెస్టుపై స్పందించారు. ఆయన అరెస్టు తర్వాత.. నారా లోకేష్ బాబుఆరోగ్యంపై ఆందోళన వెలిబుచ్చుతూ.. ట్విట్టర్(ప్రస్తుతం ఎక్స్)లో పెట్టిన పోస్టుపై అప్పట్లో కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. ఇక, ఇప్పుడు కవిత కూడా స్పందించారు.
చంద్రబాబు అరెస్టు దురదృష్టకరమని కవిత అన్నారు. బాబు కుటుంబ సభ్యుల బాధను అర్థం చేసుకోగలమని చెప్పారు. ఈ మేరకు చంద్రబాబు అరెస్ట్‌పై ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు కవిత ట్విట్టర్‌లోనే సమాధానం ఇచ్చారు. ఎక్స్ వేదికగా కొన్ని రోజులుగా `ఆస్క్ కవిత` పేరుతో కవిత కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో నెటిజన్ల ప్రశ్నలకు ఆమె సమాధానం ఇస్తున్నారు.
‘‘ఈ వయసులో చంద్రబాబుకు జరుగుతున్నది దురదృష్టకరం. ఆ కుటుంబం బాధను నేను అర్థం చేసుకున్నాను. కుటుంబ సభ్యులకు నా సానుభూతి. మాకు ఏ పార్టీతో జట్టు లేదు. తెలంగాణ ప్రజలే మా జట్టు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సెంచరీ కొట్టడం, కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావడం ఖాయం. రాజకీయ కుట్రలో పావును కాను. ధైర్యంగా కొట్లాడే పటిమ నాకుంది. బీజేపీ బీసీ సీఎం జపం ఎన్నికల గిమ్మిక్కే. ద్రోహం చేయడమే తెలంగాణకు కాంగ్రెస్‌కు ఉన్న అనుబంధం“ అని నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు కవిత సమాధానం చెప్పారు. ఇదిలావుంటే.. అనూహ్యంగా కేటీఆర్, కవితలు చంద్రబాబుపై ఇంతగా స్పందించడం వెనుక ఎన్నికల వ్యూహం ఉందనే చర్చసాగుతోంది.
This post was last modified on October 28, 2023 11:46 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం దుమారం రేపుతోన్న సంగతి…
ఇంకో వారం రోజుల్లో నూతన ఏడాది రాబోతోంది. మాములుగా అయితే టాలీవుడ్ నుంచి ఒకప్పుడు జనవరి 1నే ఏదో ఒక…
తండేల్ విడుదలకు ఇంకో నలభై మూడు రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికే కొంత ఆలస్యం తర్వాత పలు డేట్లు మార్చుకుంటూ…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై కేసు నమోదైన…
రాజకీయ నాయకులకు సన్మానాలు, సత్కారాలు కామన్. అభిమానులు..కార్యకర్తలు తమ నేతను కలిసినపుడు మర్యాదపూర్వకంగా శాలువాలు కప్పుతుంటారు. తమకు గౌరవార్థం ఇచ్చారు…
వరస బ్లాక్ బస్టర్లతో దూసుకుపోతున్న బాలకృష్ణ కొత్త సినిమా డాకు మహారాజ్ జనవరి 12 విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటిదాకా…