తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం నమోదు చేసి అధికారంలోకి రావాలని భావిస్తున్న బీజేపీ.. దానికి తగిన విధంగా.. ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేనతో పొత్తుల విషయానికి తెర దీసింది. వాస్తవానికి పవన్ కల్యాణ్.. బీజేపీతో పొత్తులో ఉన్న విషయం తెలిసిందే. అయితే, తెలంగాణలోనూ పొత్తు పెట్టుకుని.. పవన్ ఇమేజ్‌తో కొంత మేరకు సెటిలర్ల ఓట్లు తమకు అనుకూలంగా మార్చుకోవాలనేది బీజేపీ వ్యూహం.
ఈ క్రమంలోనే పవన్‌ను ఢిల్లీకి పిలిపించి మరీ చర్చించారు. అయితే.. బీజేపీ కేవలం 3 నుంచి 4 స్థానాలే ఇస్తామని చెప్పడం.. పవన్ 15-20 స్థానాలకు పట్టుబడుతుండడంతో పొత్తుల లెక్కలు కుదరలేదు. ఇది లావుంటే.. పవన్ ఎఫెక్ట్‌ను ముందుగానే గుర్తించిన అధికార పార్టీ బీఆర్ ఎస్ నేతలు.. అప్పుడే రాజకీయం ప్రారంభించేశారు. పవన్ పార్టీపై ఏపీ ముద్ర వేసే ప్రయత్నం చేశారు.
తాజాగా బీజేపీ ఒకింత బలంగా ఉన్న కూకట్‌పల్లి, మల్కాజిగిరి, సికింద్రాబాద్ సహా కొన్నినియోజకవర్గాల్లో బీజేపీ ఏపీ పార్టీతో పొత్తు పెట్టుకుంటోందనే ప్రచారానికి బీఆర్ ఎస్ క్షేత్రస్థాయి నాయకులు తెరదీశారు. దీంతో బీజేపీ నాయకులు బెంబేలెత్తుతున్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్-టీడీపీ కూటమిపై కూడా బీఆర్ ఎస్ ఇలానే ప్రచారం చేసి లబ్ధి పొందిన నేపథ్యంలో ఇప్పుడు తమకు ఆ ఎఫెక్ట్ తగులుతుందని వారు భయ పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
ఈ క్రమంలో కూకట్‌పల్లి బీజేపీ నియోజకవర్గం ఇన్‌చార్జి మాధవరం కాంతారావు సంచలన కామెంట్లు చేశారు. కూకట్‌పల్లిలో బీజేపీ బలంగానే ఉందని, తమకు పొత్తులతో పనిలేదని అన్నారు. బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న బీజేపీని బలహీనపర్చేందుకు బీఆర్‌ఎస్ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కూకట్‌పల్లిలో బీజేపీని ఎదుర్కొనే శక్తిలేకనే ఇలాంటి ప్రచారంచేసి లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. మొత్తానికి పార్టీ అధిష్టానం ఒకటి ఆశిస్తే.. క్షేత్రస్థాయిలో మరొకటి జరుగుతోందని బీజేపీ నేతలు బెంబేలెత్తడం గమనార్హం.
This post was last modified on October 28, 2023 1:04 pm
వైసీపీ ప్రభుత్వం అండ చూసుకొని సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, వారి కుటుంబ సభ్యులపై అసభ్యరమైన పోస్టులు…
ఈ రోజు సోషల్ మీడియా అంతటా ధనుష్-నయనతార గొడవ గురించే చర్చ. ధనుష్ మీద తీవ్ర విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తూ నయనతార…
ప్రభాస్ తన లైనప్ లో ఎన్ని క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేసినా కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఫోకస్ మాత్రం…
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం వైసీపీ లేని లోటును టీడీపీ ఎమ్మెల్యేలే తీర్చేస్తున్నారు. నిజానికి వైసీపీ ఉంటే కూడా ఇంతగా…
టాలీవుడ్లో అయినా.. మొత్తం ఇండియాలో అయినా… సోషల్ మీడియాలో అత్యధిక ట్రోలింగ్ ఎదుర్కొన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే మరో…
మాములుగా ఎంత పెద్ద సినిమా అయినా సరే మూడో వారంలోకి వచ్చాక నెమ్మదించడం సహజం. కానీ అమరన్ మాత్రం ఈ…