పక్క రాష్ట్రం పంచాయితీ మా దగ్గర ఎందుకు? మీకేమైనా ఉంటే.. మీ రాష్ట్రం వెళ్లి చేసుకోండంటూ సుద్దులు చెప్పే మంత్రి కేటీఆర్ మాటలు.. హరీశ్ కు వర్తించవా? నోరు విప్పితే ఏపీ ప్రస్తావన తీసుకురావటం.. ఏదో ఒక మాట అనటం గులాబీ నేతలకు అలవాటుగా మారింది. తమ అవసరానికి తగ్గట్లు అదే పనిగా ఏపీని.. ఏపీ ప్రజల మనోభావాల్ని దెబ్బ దీసేలా వ్యాఖ్యానించే ధోరణి అంతకంతకూ ఎక్కువ అవుతోంది. మీ రాష్ట్రం సంగతి మీరు చూసుకోండి.. మీ రాష్ట్ర రాజకీయం మా రాష్ట్రంలో ఎందుకు చూపిస్తారు? అని చెప్పేటప్పుడు ఏపీ ప్రస్తావన ఎందుకు తెస్తున్నట్లు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
తాజాగా మాట్లాడిన మంత్రి హరీశ్ రావు.. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కాకుంటే.. తెలంగాణ రాష్ట్రం మరో అమరావతి అవుతుందన్నారు. బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి రాకుంటే హైదరాబాద్ లో కూడా బిజినెస్ పడిపోతుందని.. అమరావతిలా మారిపోతుందని రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాట్లాడుకుంటున్నట్లుగా పేర్కొంటూ హరీశ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
కేసీఆర్ రాకుంటే హైదరాబాద్ కూడా మరో అమరావతిగా మారుతుందని రియాల్టీ వ్యాపారులు మాట్లాడుకుంటున్నట్లుగా తనకు తెలిసిందన్న హరీశ్.. “హైదరాబాద్ డెవలప్ అయిన విషయం పక్క రాష్ట్రంలోని సూపర్ స్టార్ రజనీకాంత్ కు అర్థమైంది కానీ ఇక్కడి వారికి అర్థం కాలేదు. ఇక్కడకు వచ్చిన రజనీకాంత్ మనం హైదరాబాద్ లో ఉన్నామా? న్యూయార్కులో ఉన్నామా? అని ఆశ్చర్యపోయారు. అక్కడికి రజనీకి అర్థమైంది కానీ ఇక్కడి గజనీలకు అర్థం కాలేదు” అంటూ విపక్షాలపై విరుచుకుపడ్డారు.
తమ రాష్ట్రం బాగుందన్న విషయాన్ని తమ ప్రజలకు.. తమ ప్రత్యర్థులకు అర్థమయ్యేలా చెప్పుకోలేని మంత్రి హరీశ్.. ఏపీ మీదా.. అమరావతి మీదా నోటికి వచ్చినట్లుగా మాట్లాడాల్సిన అవసరం ఏమిటి? అని ప్రశ్నిస్తున్నారు. హరీశ్ లాంటి మాటకారి సైతం అమరావతి పేరు మీద ఓట్ల రాజకీయం చేయటం చూస్తే.. ఏపీని.. ఏపీ మూలాల్ని వదిలేసి.. రాజకీయం చేసే సత్తా లేదన్న అంశం హరీశ్ మాటల్ని చూస్తే అర్థమవుతోంది. ఈ తరహా అతి మాటల కంటే.. తెలంగాణలోనూ.. హైదరాబాద్ లో చేసిన డెవలప్ మెంట్ గురించి మాట్లాడి.. ప్రజలకు అర్థమయ్యేలా చెప్పి ఓట్లు అడిగితే బాగుంటుందన్న చిన్న విషయాన్ని మంత్రి హరీశ్ ఎలా మిస్ అయినట్లు? అంటూ ఘాటుగా ప్రశ్నిస్తున్నారు.
This post was last modified on October 28, 2023 11:26 am
భారత రాష్ట్రసమితి(బీఆర్ఎస్).. ఈ పేరుకు పెద్ద ప్రాభవమే ఉంది. ఒక్కొక్కపార్టీకి నాయకుల పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. కానీ, బీఆర్ఎస్ కు…
సెంటిమెంటుకు-రాజకీయాలకు మధ్య సయామీ కవలలకు ఉన్నంత బంధం ఉంటుంది. సో.. సెంటిమెంటును కాదని నాయకులు రాజకీయాలు చేయగలరా? సాధ్యంకాదు. సో..…
తెలంగాణ పంచాయతీ ఎన్నికల పోలింగ్.. దీనికి ముందు జరిగిన ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు పంచిన నగదు.. వంటివి కీలక…
``ఫలానా వ్యక్తితో కలిసి పనిచేయండి.. ఫలానా పార్టీతో చేతులు కలపండి!`` అని ప్రధాని నరేంద్ర మోడీ తన రాజకీయ జీవితంలో…
కొందరు హీరోయిన్లు అసలేం మాట్లాడుతున్నారో ఆలోచించకుండా ఏదో ఒకటి అనేస్తారు. ఇప్పుడు రాధికా ఆప్టే అదే కోవలోకి వస్తోంది. బాలకృష్ణతో…
ప్రపంచ కప్ను కైవసం చేసుకున్న భారత మహిళా అంధుల క్రికెట్ జట్టును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరి క్యాంపు…