వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నిర్వహించిన సమీక్షలో జిల్లాల కలెక్టర్లకు ఓ రేంజిలో క్లాస్ పీకారట. గతంలో మాదిరి ఉదాశీనంగా వ్యవహరిస్తే కుదరదని, అక్రమాలపై, అక్రమ దందాలపై ఉక్కుపాదం మోపాల్సిందేనని, ఈ విషయంలో ఏమాత్రం అలసత్వం వహించినా క్షమించేది లేదని కూడా జగన్ కలెక్టర్లకు గట్టిగానే వార్నింగిచ్చారట.
ప్రత్యేకించి కరోనా బాధితులకు చికిత్సల పేరిట ప్రైవేట్ ఆసుపత్రులు కొనసాగిస్తున్న దందాకు కళ్లెం వేయాల్సిందేనని, ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులకు ఒక్క రూపాయి అదనంగా వసూలు చేసినా చర్యలు తీసుకోవాల్సిందేనని జగన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారట. ఈ విషయంలో ఏ ఒక్కరినీ ఉపేక్షించినా ఊరుకునేది లేదని కూడా జగన్ ఒకింత సీరియస్ గానే వార్నింగిచ్చారట.
ఇటీవల విజయవాడలో రమేశ్ ఆసుపత్రి ఆధ్వర్యంలో కోవిడ్ సెంటర్ నడుస్తున్న స్వర్ణ పాలెస్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడం, అందులో 10 మంది ప్రాణాలు కోల్పోయిన వ్యవహారంపై వైసీపీ సర్కారు కాస్తంత గట్టిగానే దృష్టి సారించిందనే చెప్పాలి. ఈ ప్రమాదంపై వేగంగా స్పందించిన జగన్ సర్కారు మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారాన్ని అందించడంతో పాటు ప్రమాదానికి బాధ్యులుగా గుర్తిస్తూ రమేశ్ ఆసుపత్రికి చెందిన ముగ్గురు ఉద్యోగులను అరెస్ట్ చేసింది. రమేశ్ ఆసుపత్రి అధినేత రమేశ్ ను అరెస్ట్ చేసేందుకు కూడా రంగం సిద్ధం చేసింది. అయితే హైకోర్టు ఆదేశాలతో రమేశ్ అరెస్ట్ వాయిదాపడిన… ఈ వ్యవహారంపై జగన్ సర్కారు సీరియస్ గానే ముందుకు కదిలే అవకాశాలున్నాయని చెప్పక తప్పదు.
ఇలాంటి నేపథ్యంలో కోవిడ్ చికిత్సల పేరిట రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కోవిడ్ సెంటర్లను ఏర్పాటు చేసిన ప్రైవేట్ ఆసుపత్రులు అక్రమ దందాను సాగిస్తున్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన ఓ ఆసుపత్రిని సీజ్ అయిపోయింది. మిగిలిన ప్రాంతాల్లోనూ దందా సాగిస్తున్న ఆసుపత్రులను ఉపేక్షించడానికి వీల్లేదని జగన్ తేల్చి చెప్పారట. అంతేకాకుండా కోవిడ్ సెంటర్లు పెడతామంటూ ప్రైవేట్ ఆసుపత్రులు దరఖాస్తులు చేసుకోగానే… ముందూవెనుకా చూసుకోకుండా అనుమతులు మంజూరు చేయడం కూడా కుదరదని జగన్ కలెక్టర్లకు సూచించారట.
ఈ విషయంలో ఏమాత్రం తేడాలు జరిగినా బాధ్యత వహించక తప్పదని కూడా జగన్ హెచ్చరికలు జారీ చేశారట. అంతేకాకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న కోవిడ్ సెంటర్లలో మౌలిక సదుపాయాల కల్పన, రోగులకు తక్షణమే చికిత్స అందేలా చూడాల్సిన బాధ్యత కూడా మీదేనంటూ కలెక్టర్లకు జగన్ ఆదేశాలు జారీ చేశారట. మొత్తంగా కలెక్టర్లకు జగన్ ఓ రేంజిలో క్లాస్ పీకారన్న మాట.
This post was last modified on August 27, 2020 10:06 am
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…
భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…
అమెరికా వీసా వచ్చేసింది కదా.. ఇక దాని గడువు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటే పొరపాటే. వీసా…
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ).. తాజాగా మరో ఉద్యమానికి తెరదీసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్.. జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు…
హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్రమించేవారు కొందరైతే.. తాము చేసిన పనుల కారణంగా చూపిన ధైర్య సాహసాల కారణంగా రాత్రికి…
కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…