టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు, జైలు అంశాలపై రాష్ట్రాలకు అతీతంగా ఆయన అభిమానులు, టీడీపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు హయాంలో వచ్చిన ఐటీ, ఇతర పరిశ్రమలతో ఉపాధి పొందిన యువత కూడా బాబుకు మద్దతుగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో పర్యటించేందుకు వెళ్లిన ఏపీ మంత్రి అంబటి రాంబాబుకు.. బాబు మద్దతు దారుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది.
ఖమ్మం జిల్లాలోని అశ్వారావు పేటకు మంత్రి అంబటి రాంబాబు శుక్రవారం ఉదయం వెళ్లారు. పోలీసుల రక్షణలో ఆయన కాన్వాయ్‌తో సహా వెళ్లినా.. మార్గమధ్యంలో అంబటి రాకను గుర్తించిన టీడీపీ అభిమానులు, చంద్రబాబు అభిమానులు పెద్ద ఎత్తున రోడ్డుపైకి చేరుకున్నారు. అంబటి ప్రయాణిస్తున్న వాహనాన్ని అడ్డుకున్నారు. చంద్రబాబును ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలంటూ.. యువత పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
దీంతో కాన్వాయ్‌ను పక్కగా ఆపించిన అంబటి.. యువతతో మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే, చంద్ర బాబు అరెస్టుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న యువత వైసీపీ ప్రభుత్వాన్ని, మంత్రి అంబటిని దూషించారు. తీవ్రంగా ధ్వజమెత్తారు. దీంతో కొద్దిసేపు అంబటి నిశ్చేష్టుడై రోడ్డుపైనే నిలబడి పోయారు. ఈ లోగా పోలీసులు జోక్యం చేసుకుని, యువతను సముదాయించి.. అంబటిని కాన్వాయ్ ఎక్కించి పంపించారు.
అయితే.. యువత మాత్రం కాన్వాయ్‌ను నిలువరించే ప్రయత్నం చేశారు. జై బాబు నినాదాలతో హోరెత్తించారు. అదేసమయంలో మరికొందరు డౌన్ డౌన్.. సీఎం జగన్ నినాదాలు చేశారు. మొత్తానికి తీవ్ర నిరసన దారితప్పకుండా పోలీసులు మంత్రిని అక్కడ నుంచి పంపించేయడంతో యువత శాంతించారు.
This post was last modified on October 27, 2023 2:39 pm
వైసీపీ కీలక నాయకుడు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్పటికే చాలా చిక్కుల్లో ఉన్నారు. ఒకవైపు బాబాయి వివేకానందరెడ్డి దారుణ…
క్షేత్రస్థాయిలో టీడీపీ నాయకులకు, ఎన్డీయే కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ నాయకులకు మధ్య వివా దాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.…
రాజాసింగ్... రాజకీయాల పట్ల కనీస పరిచయం ఉన్నవారికి ఎవరికైనా ఈ పేరు గురించి, ఈ నాయకుడి గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు.…
వైసీపీ ప్రభుత్వం అండ చూసుకొని సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, వారి కుటుంబ సభ్యులపై అసభ్యరమైన పోస్టులు…
ఈ రోజు సోషల్ మీడియా అంతటా ధనుష్-నయనతార గొడవ గురించే చర్చ. ధనుష్ మీద తీవ్ర విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తూ నయనతార…