టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఈ రోజు నుంచి ‘‘నిజం గెలవాలి’’ యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించిన భువనేశ్వరి…వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. స్కిల్, రింగ్‌రోడ్, ఫైబర్‌నెట్ కేసుల్లో ఆధారాలు లేకుండా చంద్రబాబును అరెస్టు చేశారని, రాష్ట్రాభివృద్ధి కోసం కష్టపడినందుకు ఆయనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబుకు సంఘీభావంగా పుంగనూరులో సైకిల్ ర్యాలీ చేస్తున్న టీడీపీ కార్యకర్తలపై దాడి చేశారని మండిపడ్డారు. తెలుగుదేశం బిడ్డలు శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు సైకిల్ యాత్ర చేపట్టారని, పుంగనూరులో ఆ బిడ్డలు టీ తాగుతుంటే..మన తెలుగు దేశం చొక్కా చింపి, జెండా చింపి కింద పడేశారని మండిపడ్డారు. కానీ, వారు ఒక్క విషయం మరచిపోతున్నారని, ఎంతమంది లీడర్లను అరెస్టు చేసినా..తెలుగు దేశం బిడ్డలు పైకి లేచి తెలుగుదేశం జెండా పైకి పట్టుకొని ప్రజలతో ముందుకు వెళతారని అన్నారు. వాళ్లు రెచ్చగొడుతున్నారని, కానీ, మనమంతా ధైర్యంగా చేయి చేయి కలిపి ఈ పోరాటంలో ముందుకు వెళదాం అంటూ భువనేశ్వరి ఎమోషనల్ గా మాట్లాడారు.
లోకేష్ పాదయాత్రను ఆపేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించారని, కానీ, యాత్రను అడ్డుకోలేకపోయారని అన్నారు. ఎన్నికల ముందు అరెస్టు చేసి చంద్రబాబును మానసికంగా దెబ్బతీస్తే, టీడీపీ చెల్లాచెదురవుతుందని వైసీపీ నేతలు అనుకుంటున్నారని, కానీ, చంద్రబాబు చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ అని, ఆయనను ఏమీ చేయలేరని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబును అరెస్టు చేస్తే అన్ని వర్గాల ప్రజలూ రోడ్లపైకి వచ్చి మద్దతిచ్చారని, ఆయనపై ప్రజలకు ఎంతో నమ్మకం ఉందని అన్నారు.
This post was last modified on October 25, 2023 10:30 pm
వైసీపీ కీలక నాయకుడు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్పటికే చాలా చిక్కుల్లో ఉన్నారు. ఒకవైపు బాబాయి వివేకానందరెడ్డి దారుణ…
క్షేత్రస్థాయిలో టీడీపీ నాయకులకు, ఎన్డీయే కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ నాయకులకు మధ్య వివా దాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.…
రాజాసింగ్... రాజకీయాల పట్ల కనీస పరిచయం ఉన్నవారికి ఎవరికైనా ఈ పేరు గురించి, ఈ నాయకుడి గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు.…
వైసీపీ ప్రభుత్వం అండ చూసుకొని సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, వారి కుటుంబ సభ్యులపై అసభ్యరమైన పోస్టులు…
ఈ రోజు సోషల్ మీడియా అంతటా ధనుష్-నయనతార గొడవ గురించే చర్చ. ధనుష్ మీద తీవ్ర విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తూ నయనతార…