ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు మరికొద్ది నెలల సమయం మాత్రమే మిగిలి ఉండడంతో వైసీపీ, టీడీపీలు వరుస యాత్రలతో హోరెత్తిస్తున్నాయి. ఈ రోజు ‘నిజం గెలవాలి’ యాత్రను టీడీపీ అధినేత నారా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ప్రారంభించగా..రేపటి నుంచి వైసీపీ ‘సామాజిక సాధికార యాత్ర’ మొదలుబెట్టనుంది. ఏపీలోని 175 నియోజకవర్గాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ఈ బస్సు యాత్రను కొనసాగించనున్నారు. సీఎం జగన్ ఆదేశాల ప్రకారం అక్టోబరు 26 నుంచి రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో 3 దశల్లో సామాజిక సాధికార యాత్ర సాగుతుంది. ఈ క్రమంలోనే తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో సామాజిక సాధికార యాత్ర పోస్టర్‌ను వైసీపీ నేతలు ఆవిష్కరించారు. పార్టీ క్యాడర్ అంతా బస్సుయాత్రలో ఉత్సాహంగా పాల్గొంటారని, అక్టోబర్ 26 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంటుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు.
రాష్ట్రంలోని రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాలలో ఒక్కో నియోజకవర్గం చొప్పున ప్రతి రోజు యాత్ర సాగనుంది. ఉత్తరాంధ్రలోని ఇచ్ఛాపురం, కోస్తాంధ్రలోని తెనాలి, రాయలసీమలోని సింగనమల నియోజకవర్గాల్లో తొలి విడత బస్సు యాత్ర రేపు మొదలై నవంబర్ 9 వరకు కొనసాగుతుంది. ఈ నెల 26న ఇచ్ఛాపురం, 27న గజపతినగరం, 28న భీమిలి, 30న పాడేరు, 31న ఆముదాలవలస, 1న పార్వతీపురం, 2న మాడుగుల, 3న నరసన్నపేట, 3న శృంగవరపుకోట నుంచి యాత్ర ఉత్తరాంధ్రలో ప్రారంభం కానుంది. 4, నవంబర్ 7న గాజువాక, నవంబర్ 8న రాజాం. నవంబర్ 9న సాలూరు, అనకాపల్లి నియోజకవర్గాల్లో బస్సు యాత్ర సాగనుంది.
రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజూ పార్టీ సమావేశాలు జరుగుతాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో సభ నిర్వహించనున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌ఛార్జ్‌లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నేతలు ఈ సమావేశాల్లో ప్రసంగిస్తారు. నాలుగున్నరేళ్ల పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అందిన సంక్షేమ ఫలాల గురించి ప్రజలకు నాయకులు వివరించాలని, సామాజిక న్యాయం, మహిళా సాధికారత, విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పుల వల్ల సాధించిన ప్రయోజనాలను ప్రజలకు తెలియజేయాలని ఈ యాత్ర చేపట్టారు.
రాబోయే ఎన్నికలు పేద, ధనిక వర్గాలకు…పేదలకు, పెత్తందారులకు మధ్య పోరు అన్న స్పష్టమైన సందేశాన్ని ఈ బస్సు యాత్రల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని జగన్ భావిస్తున్నారు. దాదాపు 2 నెలల పాటు బస్సు యాత్ర సాగుతుంది. ఈ బస్సు యాత్ర కోసం ప్రత్యేకంగా మూడు బస్సులను ఫ్యాన్ గుర్తుతో ప్రత్యేకంగా రూపొందించారు. బస్సు పైన ‘సామాజిక సాధికార యాత్ర’ అనే పేరు కనిపిస్తుంది. మరో మూడు వైపులా ‘మా నమక్కం నువ్వే జగనన్న’ అనే స్టిక్కర్లు, సీఎం జగన్ ఫొటోలు ముద్రించారు. ఈ బస్సుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన ప్రముఖ నేతల ఫొటోలను కూడా ముద్రించారు.
కోస్తాంధ్రలో అక్టోబర్ 26న తెనాలి, 27న నరసాపురం, 28న చేరాల, 30న దెందులూరు, 31న నందిగామ, నవంబర్ 1న కొత్తపేట, నవంబర్ 2న అవనిగడ్డ, నవంబర్ 3న కాకినాడ రూరల్ నుంచి బస్సుయాత్ర ప్రారంభమవుతుంది. నవంబర్ 4న గుంటూరు తూర్పు నియోజకవర్గం, నవంబర్ 6న రాజమండ్రి రూరల్, నవంబర్ 7న వినుకొండ, 8న పాలకొల్లు, 9న పామర్రు నియోజకవర్గాలలో యాత్ర సాగనుంది.
రాయలసీమలో 26న సింగనమల నియోజకవర్గం, 27న తిరుపతి, 28న ప్రొద్దుటూరు, 30న ఉదయగిరి, 31న ఆదోని, 1న కనిగిరి, 2న చిత్తూరు, 2న శ్రీకాళహస్తిలో తొలి దశ బస్సుయాత్ర ప్రారంభం కానుంది. నవంబర్ 4న ధర్మవరం, నవంబర్ 6న మార్కాపురం, 7న ఆళ్లగడ్డ, 8న నెల్లూరు రూరల్, 9న తంబళ్లపల్లెలో యాత్ర జరగనుంది.
This post was last modified on October 25, 2023 7:49 pm
ఏదైనా పెద్ద సినిమాకు సంగీత దర్శకుడిని ఎంచుకునే పని స్టార్ హీరోల దర్శకులకు పెద్ద సవాల్ గా మారుతున్న తరుణంలో…
టీడీపీ… దేశ రాజకీయాల్లో ఓ ప్రభంజనం. ఆవిర్భవించిన 9 నెలల కాలంలోనే అధికారం చేజిక్కించుకున్న పార్టీగా టీడీపీపై ఉన్న రికార్డు…
వైసీపీ పాలనలో ఆ పార్టీ నేతలు నిత్యం టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై సెటైర్ల మీద సెటైర్లు వేసే వారు.…
ఈ రోజుల్లో ఓ సినిమా విడుదలైన 4 రోజుల తర్వాత కూడా థియేట్రికల్ రన్ కొనసాగించడం అంటే అరుదైన విషయమే.…
సూర్య సినిమా ‘కంగువా’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ ఆ…
ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కుకు నిజంగానే కొత్త జీవం వచ్చేసింది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న విశాఖ ఉక్కుకు జీవం పోసేలా...…