Political News

గ‌ద్వాల్ కోట‌పై జేజెమ్మ జెండా.. ఎగ‌ర‌డం కష్ట‌మేనా?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల దృష్టిని ఎక్కువ‌గా ఆక‌ర్షించే నియోజ‌క‌వ‌ర్గం మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా లోని గ‌ద్వాల్ అసెంబ్లీ స్థానం. దీనికి కార‌ణం.. పొలిటిక‌ల్ ఫైర్ బ్రాండ్, గ‌ద్వాల్ జేజెమ్మ‌గా పేరొందిన డీకే అరుణ కీల‌కంగా మార‌డ‌మే. ఇప్ప‌టి వ‌రకు ఆమె ప్ర‌తి ఎన్నిక‌లోనూ కాంగ్రెస్ పార్టీ టికెట్‌పైనే పోటీ చేస్తుండ‌గా.. తొలిసారి బీజేపీ త‌ర‌ఫున బ‌రిలోకి దిగ‌నున్నారు. ఇప్ప‌టికే ప్ర‌చారం కూడా ప్రారంభించారు. ఇంటింటికీ తిరుగుతున్నారు.

వాస్త‌వానికి 2004లో పొలిటిక‌ల్‌గా త‌న కెరీర్‌ను ప్రారంభించిన డీకే అరుణ అప్ప‌టి నుంచి 2018 అసెంబ్లీ ఎన్నిక‌ల వ‌ర‌కు కూడా కాంగ్రెస్ త‌ర‌ఫునే పోటీ చేశారు. మంత్రి పీఠాన్ని కూడా సొంతం చేసుకున్నారు. అయితే, అనూహ్యంగా కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి.. బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక‌, ఇప్పుడు ఆ పార్టీ అభ్య‌ర్థిగానే బ‌రిలోకి దిగుతున్నారు. తాను పార్టీ మారిన నేప‌థ్యంలో సంప్ర‌దాయంగా వ‌స్తున్న త‌న ఓటు బ్యాంకు.. ఇప్పుడు జేజెమ్మ‌ను క‌ల‌వ‌ర పెడుతోంది.

ముఖ్యంగా గ్రామీణ ఓట‌ర్లు ఇప్ప‌టికీ డీకే అరుణ కాంగ్రెస్‌లోనే ఉన్నార‌ని అనుకుంటున్నారు. దీంతో ఆమెకు ఓటు వేయాల‌నుకునేవారు కాంగ్రెస్‌కే వేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు డీకే అనుచ‌రులు చెప్పుకొచ్చా రు. దీంతో ఖంగుతిన్న డీకే.. వెంట‌నే హుటాహుటిన రంగంలోకి దిగి.. ప‌ల్లె బాట ప‌ట్టారు. తాను కాంగ్రెస్‌లో లేన‌ని.. అతి పెద్ద బీజేపీలో ఉన్నాన‌ని ఆమె ప్ర‌జ‌ల‌ను త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

ఇదిలావుంటే.. సంప్ర‌దాయంగా ఇక్క‌డ రెండు ఓటు బ్యాంకులు మాత్ర‌మే ఉన్నాయి. ఒక‌టి కాంగ్రెస్‌, రెండు బీఆర్ ఎస్‌. 2018 ఎన్నిక‌ల్లో బీఆర్ ఎస్ నేత కృష్ణ మోహ‌న్‌రెడ్డి విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇటీవ‌ల ఆయ‌న గెలుపును హైకోర్టు తోసిపుచ్చింది. ఈ క‌థ వేరే ఉంది. అయితే.. ఇప్పుడు కొత్త‌గా బీజేపీ ఓటు బ్యాంకును పెంచుకోవ‌డం, కాంగ్రెస్ వ‌ర్గాన్ని త‌న‌వైపు తిప్పుకోవ‌డం పైనే జేజెమ్మ గెలుపు ఆధార‌ప‌డి ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on October 25, 2023 1:09 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

స‌లార్-1పై నిరాశ‌.. స‌లార్-2పై భ‌రోసా

బాహుబ‌లి-2 త‌ర్వాత వ‌రుస‌గా మూడు డిజాస్ట‌ర్లు ఎదుర్కొన్న ప్ర‌భాస్‌కు స‌లార్ మూవీ గొప్ప ఉప‌శ‌మ‌నాన్నే అందించింది. వ‌ర‌ల్డ్ వైడ్ ఆ…

5 hours ago

సినీప్రముఖుల ఇళ్ళపై రాళ్ల‌దాడి.. సీఎం రేవంత్ రియాక్ష‌న్!

ఐకాన్ స్టార్‌.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొంద‌రు వ్య‌క్తులు దాడికి దిగిన విష‌యం తెలిసిందే. భారీ ఎత్తున…

6 hours ago

తాతకు త‌గ్గ‌ మ‌న‌వ‌డు.. నారా దేవాన్ష్ `రికార్డ్‌`

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌న‌వ‌డు, మంత్రి నారా లోకేష్‌, బ్రాహ్మ‌ణి దంప‌తుల కుమారుడు నారా దేవాన్ష్‌.. రికార్డు సృష్టించారు. ఇటీవ‌ల…

8 hours ago

అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి.. ఎవరి పని?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో కొంద‌రు ఆందోళ‌న కారుల‌ను పోలీసులు అరెస్టు…

10 hours ago

అల్లు అర్జున్‌కు షాక్‌.. వీడియో బ‌య‌ట పెట్టిన సీపీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మ‌రింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేట‌ర్ ఘ‌ట‌న‌పై ఇప్ప‌టికే ఏ11గా కేసు న‌మోదు…

10 hours ago

మీకు కావలసినవన్నీ గేమ్ ఛేంజర్ లో ఇరుక్కు : చరణ్!

తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…

10 hours ago