జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణిలపై మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. వై ఏపీ నీడ్స్ చంద్రబాబు, వై ఏపీ నీడ్స్ పవన్ కల్యాణ్ అని ప్రజల ముందుకు వెళ్ళే దమ్ముందా..? అని రోజా ప్రశ్నించారు. నిజం గెలవాలంటూ భువనేశ్వరి యాత్ర చేయబోతున్నారని, స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంపై సీబీఐ ఎంక్వైరీ వేయిస్తే నిజం తప్పకుండా గెలుస్తుందని అన్నారు.
లోకేష్ యువగళం పాదయాత్రకు మంగళం పాడారని, భువనేశ్వరి, లోకేశ్ ఫ్యాషన్ షోకు వెళ్తున్నారని రోజా ఎద్దేవా చేశారు. భువనేశ్వరి నిజం గెలవాలని పూజలు చేస్తున్నారంటే చంద్రబాబు జైలులోనే శాశ్వతంగా ఉండాలని శ్రీవారిని కోరుకున్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.
ఈ క్రమంలోనే రోజా కామెంట్లకు టీడీపీ ఎమ్మెల్సీ అనురాధ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు కుటుంబం గురించి మాట్లాడేటప్పుడు రోజా తన స్థాయింటో తెలుసుకోవాలని హితవు పలికారు. ఒక స్త్రీ అయి ఉండి నోటికొచ్చినట్లు మాట్లాడటం సరిదకాదని, గతంలో చెక్ బౌన్స్ అయిన రోజాకు వందల కోట్లు ఎలా వచ్చాయని నిలదీశారు.
దమ్ముంటే రోజా ఆస్తులపై సీబీఐ విచారణ కోరాలని సవాల్ విసిరారు. జగన్ పై ఉన్న కేసుల్లో సీబీఐ, ఈడీ విచారణ త్వరగా చేయాలని కోరే దమ్ముందా అని ప్రశ్నించారు. ఉదయం ఎక్సర్‌సైజులు.. మధ్యాహ్నం నాన్ వెజ్ తిండి..రాత్రి పుల్ పార్టీలు తప్ప.. నగరికి రోజా ఏం చేసిందో చెప్పాలని నిలదీశారు. 16 కార్లు, నాలుగు పెట్రోల్ బంకులు, ఎస్సీ, ఎస్టీ అసైన్డ్ భూములను మంత్రి రోజా లాక్కున్నారని. నగరిలో రోజా, ఆమె అన్నదమ్ములు అనకొండల్లా దోచుకుంటున్నారని మండిపడ్డారు.
This post was last modified on October 24, 2023 9:43 pm
యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల వారసుడు రోషన్ కనకాల నటించిన మోగ్లీకి ఎదురీత తప్పడం లేదు. అఖండ తాండవం…
ఇంకో అయిదు రోజుల్లో అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ విడుదల కాబోతోంది. మాములుగా అయితే ఈపాటికి అడ్వాన్స్ ఫీవర్…
40 % ఓటు బ్యాంకు గత ఎన్నికల్లో వచ్చిందని చెబుతున్న వైసిపికి అదే ఓటు బ్యాంకు నిలబడుతుందా లేదా అన్నది…
ఇంకో ఇరవై నాలుగు రోజుల్లో సంక్రాంతి హడావిడి మొదలైపోతుంది. ఒకటి రెండు కాదు స్ట్రెయిట్, డబ్బింగ్ కలిపి ఈసారి ఏకంగా…
అఖండ 2 బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ లో తమన్ మాటలు చర్చకు దారి తీస్తున్నాయి. ఇండస్ట్రీలో యూనిటీ లేదని,…
ఎవరో జ్వాలలు రగిలించారు, వేరెవరో దానికి బలి అయ్యారు అంటూ ఒక పాత పాట ఉంటుంది. ఎన్ని తరాలు మారినా…