తెలంగాణలో శాసనసభ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకుంటున్నాయి. ఈ నేపద్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటలుతూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత, మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కుర్చీల కోసం పార్టీలు మారే వ్యక్తి రేవంత్ రెడ్డి అని హరీష్ షాకింగ్ కామెంట్స్ చేశారు. గతంలో సోనియా గాంధీని నోటికొచ్చినట్లు తిట్టిన రేవంత్ రెడ్డి… ఇప్పుడు ఆమెను దేవత అంటూ పొగుడుతున్నారని ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ ఎవరికి బీ టీమ్ కాదని, తమది తెలంగాణ ప్రజల టీమ్ అని హరీష్ స్పష్టం చేశారు. ఓటుకు నోటు….నోటుకు సీటు అనేవాళ్ళు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయని వ్యక్తి తెలంగాణను ఎలా అభివృద్ధి చేస్తారని హరీష్ రావు ప్రశ్నించారు. కర్ణాటక రైతులు కాంగ్రెస్ కు ఓటేసినందుకు ఇప్పుడు బాధపడుతున్నారని, తెలంగాణలో ఉన్న పథకాలు కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాలలో ఎందుకు లేవని హరీష్ రావు ప్రశ్నించారు.
మరోవైపు, కాంగ్రెస్ పార్టీపై మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. కర్ణాటకలో ఉచిత విద్యుత్ హామీని అమలు చేయని కాంగ్రెస్ పార్టీకి ముందుంది ముసళ్ళ పండుగ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కర్ణాటకలో ఇచ్చిన హామీ ప్రకారం కరెంటు ఇస్తారా లేక మొసలిని సబ్ స్టేషన్ లో వదిలిపెట్టమంటారా అంటూ కొంతమంది రైతులు ట్రాక్టర్లో మొసలిని తీసుకువచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కర్ణాటకలో 200 యూనిట్ల విద్యుత్ రైతులకు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ దానిని నెరవేర్చకపోవడంతో రైతులు ఇలా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే, అదే హామీని తెలంగాణలో కూడా అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించడంతో కేటీఆర్ ముందుంది ముసళ్ల పండుగ అంటూ చురకలంటించారు.
This post was last modified on October 24, 2023 9:26 pm
భారత రాష్ట్రసమితి(బీఆర్ఎస్).. ఈ పేరుకు పెద్ద ప్రాభవమే ఉంది. ఒక్కొక్కపార్టీకి నాయకుల పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. కానీ, బీఆర్ఎస్ కు…
సెంటిమెంటుకు-రాజకీయాలకు మధ్య సయామీ కవలలకు ఉన్నంత బంధం ఉంటుంది. సో.. సెంటిమెంటును కాదని నాయకులు రాజకీయాలు చేయగలరా? సాధ్యంకాదు. సో..…
తెలంగాణ పంచాయతీ ఎన్నికల పోలింగ్.. దీనికి ముందు జరిగిన ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు పంచిన నగదు.. వంటివి కీలక…
``ఫలానా వ్యక్తితో కలిసి పనిచేయండి.. ఫలానా పార్టీతో చేతులు కలపండి!`` అని ప్రధాని నరేంద్ర మోడీ తన రాజకీయ జీవితంలో…
కొందరు హీరోయిన్లు అసలేం మాట్లాడుతున్నారో ఆలోచించకుండా ఏదో ఒకటి అనేస్తారు. ఇప్పుడు రాధికా ఆప్టే అదే కోవలోకి వస్తోంది. బాలకృష్ణతో…
ప్రపంచ కప్ను కైవసం చేసుకున్న భారత మహిళా అంధుల క్రికెట్ జట్టును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరి క్యాంపు…