సరిగ్గా ఎన్నికల ముందు కేసీయార్ తో పాటు మొత్తం బీఆర్ఎస్ డిఫెన్సులో పడిపోయింది. ఎలాగంటే కాళేశ్వరం ప్రాజెక్టులోని లోపాలు బయటపడుతున్నాయి. ఇదే సమయంలో మేడిగడ్డ బ్యారెజిలోని రెండు పిల్లర్లు కుంగిపోవటంతో కేసీయార్ అండ్ కో పైన దెబ్బ మీద దెబ్బ పడింది. ఇంతకాలం కాళేశ్వరం ప్రాజెక్టును ఇంజనీరింగ్ అద్భుతమని, కాళేశ్వరం ప్రాజెక్టు కేసీయార్ రూపకల్పనగాను, కేసీయార్ మానసపుత్రికగాను బీఆర్ఎస్ పదేపదే ప్రచారం చేసుకున్నది. కేసీయార్ కాబట్టే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించగలిగినట్లు ఒకటే ఊదరగొట్టిన విషయం అందరికీ తెలిసిందే.
అలాంటిది ఇపుడు ప్రాజెక్టులోని లోపాలు బయటపడుతుండటంతో ఏమి మాట్లాడాలో అర్ధంకావటంలేదు. ఇదే సమయంలో మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించిన రెండు పిల్లర్లు కుంగిపోయాయి. దాంతో కాంగ్రెస్, బీజేపీ నేతలు పదేపదే ఇవే విషయాలను ప్రస్తావిస్తున్నారు. రెండు ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిని హైలైట్ చేస్తు ఆరోపణలు చేస్తున్నారు. దాంతో ప్రతిపక్షాల ఆరోపణలకు ఏమని సమాధానం చెప్పాలో మంత్రులు, అధికారపార్టీ ఎంఎల్ఏలకు దిక్కుతోచటంలేదు. ఎన్నికల ముందు ఇలాంటి ఘటనలు జరగటంతో కేసీయార్ కు కూడా పెద్ద షాక్ తగిలినట్లే అయ్యింది.
ఇక్కడ సమస్య ఏమిటంటే ఇరిగేషన్ శాఖ కేసీయార్ ఆధీనంలోనే ఉండటం. కాబట్టి రెండు ప్రాజెక్టుల్లోని లోపాలకు సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత కూడా కేసీయార్ మీదే ఉంది. అయితే సహజంగానే కేసీయార్ ఎవరికీ అందుబాటులో ఉండరు కాబట్టి అందుబాటులో ఉండే మంత్రులనే ప్రతిపక్షాలు, జనాలు టార్గెట్ చేస్తున్నారు. కమీషన్ల కక్కుర్తి వల్లే ప్రాజెక్టులను నాసిరకంగా నిర్మించారంటు ప్రతిపక్షాలు నేతలు పదేపదే ఆరోపణలతో విరుచుకుపడుతున్నారు. ఆరోపణలు చేయటమే కాకుండా ఇదే విషయాన్ని కేంద్ర జలశక్తి శాఖకు ఫిర్యాదులు కూడా చేస్తున్నారు.
దాంతో ప్రతిపక్షాల దెబ్బకు ప్రభుత్వంతో పాటు అధికారపార్టీ పూర్తిగా డిఫెన్సులో పడిపోయింది. అందుకనే మంత్రులతో పాటు ఎంఎల్ఏలు మీడియాను ఫేస్ చేయలేకపోతున్నారు. కేసీయార్ ఆధీనంలో ఉండే శాఖ కాబట్టి ఎవరితో ఏమి మాట్లాడితే సమస్యలు వస్తాయో అనే టెన్షన్ తో అందరు మీడియాకు దూరంగా ఉంటున్నారు. పోనీ ప్రభుత్వం తరపున మీడియాకు ఏమైనా ప్రకటన విడుదలైందా అంటే అదీలేదు. మొత్తానికి ఎన్నికల్లో కేసీయార్ ను ఇరుకునపెట్టడానికి ప్రతిపక్షాలకు పెద్ద ఆయుధమే దొరికింది.
This post was last modified on October 24, 2023 12:01 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…