తెలంగాణా బీజేపీలో ఇపుడు అందరిచూపు మాజీమంత్రి డీకే అరుణపైనే పడింది. జాతీయ ఉపాధ్యక్షురాలి హోదాలో డీకే బాగా యాక్టివ్ గానే పార్టీలో పనిచేస్తున్నారు. అలాంటిది 52 మందితో పార్టీ ప్రకటించిన మొదటిజాబితాలో డీకే పేరు కనబడలేదు. దాంతో చాలామంది అనేకరకాలుగా అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. అయితే ఇదే సమయంలో గద్వాల నియోజకవర్గంలో ఎంఎల్ఏగా పోటీచేయకూడదని డీకే తీసుకున్న నిర్ణయం కారణంగానే మొదటిజాబితాలో ఆమె పేరు లేదని అర్ధమవుతోంది.
గద్వాల నుండి డీకే ఎందుకని పోటీచేయటంలేదనే విషయంలో అయోమయం పెరిగిపోతోంది. డీకే సమీపబంధువు, టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంఎల్ఏ బండ్ల కృష్ణమోహన్ రెడ్డికే కేసీయార్ టికెట్ ప్రకటించారు. వీళ్ళిద్దరి మధ్యే పోటీ తీవ్రంగా ఉంటుందని అందరు అనుకున్నారు. అయితే డీకే మాత్రం చివరి నిముషంలో పోటీకి వెనకాడటంతో అందరు ఆశ్చర్యపోయారు. ఇదే సమయంలో జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ సరిత కాంగ్రెస్ లో చేరి పోటీకి సిద్ధపడ్డారు. కాంగ్రెస్ కు సానుకూల పవనాలు పెరుగుతున్నాయనే ప్రచారం, బీసీ వాదం బలపడుతోంది. కాబట్టి సరితే కాంగ్రెస్ తరపున పోటీలో ఉండేందుకు అవకాశాలున్నాయి.
ఒకవైపు దగ్గరి బంధులు మరోవైపు బీసీ వాదం, కాంగ్రెస్ గాలి కారణంగానే ఓటమి భయంతోనే డీకే అసెంబ్లీకి పోటీచేయకూడదని అనుకున్నారనే ప్రచారం పెరిగిపోతోంది. పెరిగిపోతున్న బీసీ వాదాన్ని దృష్టిలో పెట్టుకునే బీజేపీ తరపున బలమైన బీసీ నేతను పోటీలోకి దింపాలని డీకే డిసైడ్ అయ్యారనే ప్రచారం మొదలైంది.
ఎంతమంది మద్దతుదారులు గద్వాలలో పోటీచేయాలని డీకేపై ఒత్తిడి తెస్తున్నా ఆమె మాత్రం పోటీకి ససేమిరా అంటున్నారు. అయితే పార్టీవర్గాల సమాచారం ప్రకారం ఆమె రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విషయం ఏమిటో తేలిపోతుంది కాబట్టి దాని తర్వాత పార్లమెంటుకు పోటీపై నిర్ణయం తీసుకోవచ్చని డీకే అనుకుంటున్నట్లు సమాచారం. పార్టీ అంచనా వేసినట్లు ఫలితాలు ఉంటే పార్లమెంటుకు డీకే పోటీచేస్తారని లేకపోతే అప్పటి పరిస్ధితులను బట్టి నిర్ణయించుకుంటారని ఆమె మద్దతుదారులు చెబుతున్నారు. మొత్తానికి గద్వాలలో పోటీచేయకూడదన్న డీకే నిర్ణయం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
This post was last modified on October 24, 2023 11:59 am
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…