మాజీ ఎమ్మెల్యే, సీనియర్ దళిత నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఉద్దేశంలో తన వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌కు మేలు చేస్తాయని అనుకుని ఉండొచ్చు. కానీ, ఇప్పటికే ఉప్పు-నిప్పుగా ఉన్న కాంగ్రెస్ నేతల మధ్య మోత్కుపల్లి మరో విపత్తుకు తెరదీశారనే చర్చ సాగుతుండడం గమనార్హం. తాజాగా మోత్కుపల్లి మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డిని ఆకాశానికి ఎత్తేశారు.
తెలంగాణలో జరుగుతున్న తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు గుర్రం ఎక్కితే రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని, అవ్వాల్సిన అవసరం ఉందని.. ఆయనకే అధిష్టానం మొగ్గు కూడా ఉందని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. రేవంత్‌రెడ్డి హయాంలోనే కాంగ్రెస్ పార్టీ పుంజుకుందని.. చెప్పుకొచ్చారు. అయితే, వాస్తవానికి ముఖ్యమంత్రి రేసులో ముగ్గురు నుంచి నలుగురు నాయకులు పోటీ పడుతున్నారు.
వీరంతా తమ తమ మందీమార్బలాలతో బహిరంగ ప్రచారం కూడా చేసుకుంటున్నారు. ఇక, కాంగ్రెస్ అధిష్టానం ఈ విషయంలో మౌనంగా ఉంది. ముందు గెలిచాక.. తర్వాత ముఖ్యమంత్రి పీఠంపై నిర్ణయం తీసుకునేలా కాంగ్రెస్ ముందుకు సాగుతోంది. ఇంతలో మోత్కుపల్లి రేవంత్‌ను ఎత్తేస్తూ.. ఆయనే సీఎం అవుతారని.. ఆయనకు సీఎం సీటు ఇవ్వకపోతే.. అన్యాయం చేసినట్టు అవుతుందని, ఇక, కాంగ్రెస్‌ను ఎవరూ నమ్మరని వ్యాఖ్యానించడం పార్టీలో మరో చిచ్చుకు దారితీసే ప్రమాదం ఉందనే సంకేతాలు వస్తున్నాయి.
ఇదిలావుంటే, సీఎం కేసీఆర్‌పై మరోసారి మోత్కుపల్లి విరుచుకుపడ్డారు. ఆయన ఆరోగ్యం బాగోలేదనే వార్తలు వస్తున్నాయని.. రేపో మాపో ఆయన ఆసుపత్రిలో చేరతారని తనకు సమాచారం ఉందని, అలాంటి నాయకుడికి ఓట్లేస్తే.. మళ్లీ కుటుంబ పాలనే వస్తుందని మోత్కుపల్లి చెప్పుకొచ్చారు. పదేళ్లు కేసీఆర్ కు అవకాశం ఇచ్చింది చాలని.. దొరల పాలనతో ప్రజలు విసిగిపోయారని వ్యాఖ్యానించారు.
This post was last modified on October 23, 2023 7:22 pm
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…
ఇప్పటి వరకు పీపీపీ మోడల్ గురించే ప్రజలకు తెలుసు. అయితే.. తొలిసారి ఏపీలో పీపీపీపీ అనే 4-పీ ఫార్ములాను సీఎం…
యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం తన కెరీర్లోనే అత్యంత భారీ ప్రాజెక్టుల మీద దృష్టి సారిస్తున్నాడు. ప్రస్తుతం చందూ మొండేటి…
ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో చావు దెబ్బతిన్న వైసీపీ..ఇంకా పాఠాలు నేర్చుకున్న ట్టు కనిపించడం లేదు. ముఖ్యంగా…