ఏపీలో జరగనున్న 2024 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దక్కించుకునేందుకు యుద్ధప్రాతిపదికన కదులుతున్న తెలుగు దేశం పార్టీలో కొన్నాళ్లుగా రగులుతున్న అసంతృప్తి.. ఎన్నికల ముంగిట మరింత పెరిగిందనే సంకేతాలు వస్తున్నాయి. పైకి అంతా బాగానే ఉందని నాయకులు భావిస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో సుమారు 40 నియోజకవర్గాలకుపైగానే అసంతృప్తి ఛాయల్లో నలుగుతున్నాయి. తమను పట్టించుకోవడం లేదని కొందరు.. తమకు టికెట్ ఇస్తారో లేదో అని కొందరు తమ్ముళ్లు మీమాంసలో రగిలిపోతున్నారు.
ఉదాహరణకు.. నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ, నంద్యాల స్థానాలు, ఉమ్మడి కృష్ణాలోని గుడివాడ, నూజివీడు, పెడన, గన్నవరం(ఇక్కడ వైసీపీ నుంచి వచ్చిన యార్లగడ్డకు టికెట్ ప్రకటించడంపై తమ్ముళ్లు రగులుతు న్నారు), విజయవాడ పశ్చిమ, అనంతపురంలోని కదిరి, అనంతపురం అర్బన్, పుట్టపర్తి, ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడు, తాడికొండ, శ్రీకాకుళంలోని శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లాల్లోని నరసాపురం, ఉండి, భీమవరం వంటి నియోజకవర్గాల్లో అసంతృప్తి చాపకింద నీరులా ఉంది.
ఇక, పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం, తూర్పులోని తుని(ఇక్కడ మాజీ మంత్రి యనమల కుటుంబానికే టికెట్ ఇస్తుండడం, వారు ఓడిపోతుండడంపై తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు), ప్రత్తిపాడు వంటి అనేక నియోజకవర్గాల్లో తమ్ముళ్లు టికెట్ల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే.. జనసేనతో పొత్తు దరిమిలా వీటిలో సగం స్థానాలకుపైగానే.. జనసేన కు కేటాయించే అవకాశం ఉంది. ఆయా నియోజకవర్గాల్లో జనసేన బలం ఎక్కువగా ఉందనేది సమాచారం.
ఈ నేపథ్యంలో టీడీపీలో అసంతృప్తితో రగిలిపోతున్న తమ్ముళ్లు ముందు ఈ విషయం తేల్చాలని పట్టుబ డుతున్నారు. తాజాగా నారా లోకేష్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం ముగియగానే.. దాదాపు 20 మందికిపైగా నాయకులు లోకేష్‌ను చుట్టుముట్టి తమ ఆవేదనను వెల్లడించారు. టికెట్లపై భరోసా ఇస్తేరంగంలోకి దిగుతామని చెప్పారు. అయితే, టికెట్ల విషయాన్ని చంద్రబాబు చూసుకుంటారని.. ఆ విషయం పక్కన పెట్టి పార్టీని బలోపేతం చేయాలని, జనసేనతో కలిసి ముందుకు సాగాలని మాత్రమే లోకేష్ చెప్పుకొచ్చారని సమాచారం. ఇది పైకి బాగానే ఉన్నప్పటికీ.. టికెట్లు ఆశిస్తున్న తమ్ముళ్లలో మాత్రం అసంతృప్తి సెగలు కొనసాగుతున్నాయి. దీనిని కాదనలేని పరిస్థితి నెలకొంది. మరి ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on October 23, 2023 7:17 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…