Political News

ప్ర‌తి కుటుంబానికీ ఏదో ఒక‌టి.. గేర్ మార్చిన‌ వైసీపీ

వ‌చ్చే 2024 ఎన్నిక‌ల్లోనూ విజ‌యం ద‌క్కించుకుని రికార్డు సృష్టించాల‌ని భావిస్తున్న ఏపీ అధికార పార్టీ వైసీపీ తాజాగా గేర్ మార్చిన‌ట్టు తెలుస్తోంది. తాడేప‌ల్లి వ‌ర్గాల క‌థ‌నం మేర‌కు.. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న వివిధ ప‌థ‌కాలు.. ఆయా వ‌ర్గాల‌కు చేరుతున్నాయి. అయితే.. వీటిలోనూ కోత వేసి.. ల‌బ్ధి దారుల సంఖ్య‌ను త‌గ్గించ‌డం ద్వారా.. ఆర్థిక‌ భారం నుంచి స‌ర్కారు త‌ప్పించుకుంటోంద‌ని టీడీపీ విమ‌ర్శిస్తున్న విష‌యం తెలిసిందే.

అయితే, ఎన్నిక‌ల‌కు ముందు.. ఈ ప‌రిణామం ప్ర‌తిప‌క్షాల‌కు ప్ర‌చారాస్త్రం అయ్యే అవ‌కాశం ఉంద‌ని గ్ర‌హించిన వైసీపీ.. ఇప్పుడు ప్ర‌తి కుటుంబానికీ ఏదో ఒక‌టి ప‌ల్లవిని వినిపించేలా వ్యూహం రెడీ చేస్తోంది. దీనిపై తాజాగా సీఎం జ‌గ‌న్‌.. త‌న‌కు అందుబాటులో ఉన్న స‌ల‌హ‌దారులు, ముఖ్య నాయ‌కుల‌తో చ‌ర్చించిన‌ట్టు తాడేప‌ల్లి వ‌ర్గాలు చెబుతున్నాయి. అంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు ల‌బ్ధి పొంద‌ని కుటుంబాల‌ను ఎంపిక చేసుకుని.. వారికి ప్ర‌త్యామ్నాయంగా ఏదైనా ప‌థ‌కం అమ‌లు చేయ‌డ‌మో.. లేక ఉన్న వాటిలోనే ఒక‌టి వారికి అమ‌లు చేయ‌డ‌మో చేయ‌నున్నారు.

మొత్తంగా రాష్ట్రంలోని 2.5 కోట్ల కుటుంబాల్లో ఇప్ప‌టికే ల‌బ్ధి పొందుతున్న కోటిన్న‌ర కుటుంబాల‌ను ప‌క్క‌న పెట్టి.. మిగిలిన కోటి కుటుంబాల‌కు కూడా ఏదో ఒక రూపంలో వ‌చ్చే మూడు మాసాల్లో ప‌థ‌కాల‌ను విస్తృతంగా అమ‌లు చేయాల‌నేది వ్యూహం. దీనిపై వ‌చ్చే 15 రోజుల్లోనే వ‌లంటీర్లు, గృహ సార‌థుల ద్వారా కీల‌క స‌ర్వే చేయించి.. ఇప్ప‌టి వ‌ర‌కు స‌ర్కారు నుంచి ఒక్క రూపాయి కూడా ల‌బ్ధి పొంద‌ని వారిని గుర్తించ‌నున్నారు. వారికి వెంట‌నే ఏదో ఒక ప‌థ‌కాన్ని అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించారు.

ముఖ్యంగా కాపులు, రెడ్డి, క‌మ్మ సామాజిక వ‌ర్గాల్లోని అర్హులను ఇప్పుడు తెర‌మీదికి తెచ్చేలా వైసీపీ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేయ‌నుంద‌ని స‌మాచారం. త‌ద్వారా ఆయా సామాజిక వ‌ర్గాల్లో నెల‌కొన్న అసంతృప్తిని త‌గ్గించ‌డం, ఓటు బ్యాంకు ను త‌మ‌వైపు సాధ్య‌మైనంత వ‌ర‌కు తిప్పుకొనే దిశ‌గా అడుగులు వేయ‌నుంది. ఇదేస‌మ‌యంలో ఎన్నిక‌ల‌కు ముందు పెట్రోల్‌పై రాష్ట్ర‌స‌ర్ చార్జీల‌ను త‌గ్గించాల‌నేది కూడా చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్టు తెలిసింది. ప్ర‌స్తుతం పెట్రోల్ ధ‌ర‌ల‌పై ఏపీ ప్ర‌జ‌లు ఆగ్ర‌హంతో ఉన్నారు. మొత్తానికి ప్ర‌తి కుటుంబానికీ ఏదో ఒకటి నినాదాంతో వైసీపీ ఇక‌పై ముందుకు సాగ‌నుంద‌ని స‌మాచారం. మ‌రి ఇది ఏమేర‌కు ల‌బ్ధి చేకూరుస్తుందో చూడాలి.

This post was last modified on October 23, 2023 11:36 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పోకిరి రేంజ్ ట్విస్ట్ ఇచ్చిన రావిపూడి

ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…

4 hours ago

ఇళయరాజా అభయమందుకున్న వరప్రసాద్ గారు

మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…

6 hours ago

విజ‌య్‌కు సీబీఐ సెగ‌… `పొత్తు` కోసమా?

త‌మిళ దిగ్గ‌జ న‌టుడు, త‌మిళగ వెట్రి క‌గ‌ళం(టీవీకే) అధ్య‌క్షుడు విజ‌య్ వ్య‌వ‌హారం.. మ‌రింత ముదురుతోంది. గ‌త ఏడాది సెప్టెంబ‌రు 27న‌…

6 hours ago

చేతులు కాలాక ఆలోచిస్తే ఏం లాభం

రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…

6 hours ago

నారావారి ప‌ల్లెముచ్చ‌ట్లు: మ‌న‌వ‌డి ఆట‌లు – తాత మురిపాలు

ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత గ్రామం.. ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని నారావారి ప‌ల్లెలో ముంద‌స్తు సంక్రాంతి వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు.…

8 hours ago

రవితేజకు రిలీఫ్ దొరికినట్టేనా

గత కొన్నేళ్లుగా మినిమమ్ హిట్ లేకుండా అభిమానులను హర్ట్ చేస్తున్న మాస్ మహారాజా రవితేజ ఈసారి పూర్తిగా రూటు మార్చి…

8 hours ago