అభిమానం ఉండాలే కానీ దురభిమానం ఉండొద్దు. ఎంత అధికార పక్షమైనప్పటికి అహంకారం తలకెక్కకూడదు. అలాంటి తీరు చూసే వారికి ఎబ్బెట్టుగా ఉండటమే కాదు.. పార్టీకి.. ప్రభుత్వానికి చెడ్డపేరును తీసుకొస్తుంది.
అందునా.. తన మానాన తాను యాత్ర చేసుకుంటూ పోతున్నోడిని కెలికి మరీ.. లోకల్ జులం చూపిస్తూ.. దారుణంగా వ్యవహరించిన తీరుపై ఇప్పుడు ఆగ్రహం వ్యక్తమవుతోంది.
చంద్రబాబు జైల్లో ఉన్న నేపథ్యంలో.. ఆయనకు సంఘీభావంగా నిలుస్తూ.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొందరు సైకిల్ యాత్ర చేపట్టటం.. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లా పుంగనూరులో యాత్ర చేసుకుంటూ వెళుతున్న వారిపై దాష్ఠీకం ప్రదర్శించిన వారికి సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి.
ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ప్రధాన అనుచరుడిగా చెప్పుకుంటూ ఆయనకు సన్నిహితంగా ఉండే చెంగలాపురం సూరి వ్యవహారశైలి ఇప్పుడు షాకింగ్ గా మారింది. భౌతికదాడులకు పాల్పడటం.. అల్లర్లు.. నేరాలకు తెగబడుతూ ప్రభుత్వానికి.. పార్టీకి చెడ్డపేరు తెస్తుంటారన్న పేరుంది.
మదనపల్లి నియోజకవర్గంలో అతడు చేసే అరాచకాలకు అంతే లేదన్న మాట వినిపిస్తూ ఉంటుంది. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో అతగాడిపై ఉన్న రౌడీషీట్ ను పోలీసులు ఎత్తేయటం గమనార్హం. సూరి వద్ద కారు డ్రైవర్ గా పని చేసే వినయ్ మీద రెండు కేసులు ఉన్నాయి. సూరితో సన్నిహితంగా ఉండే శివప్పకు నేరచరిత్ర ఉందని చెబుతున్నారు. మొత్తంగా రౌడీయిజంతో ఇష్టారాజ్యంగా వ్యవహరించే ఇతగాడి తీరుతో మంత్రి పెద్దిరెడ్డికి లాభం కంటే నష్టమే ఎక్కువన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పేరుకు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు చెప్పుకున్నా.. చేసేది మాత్రం సెటిల్ మెంట్లు.. దందాలేనని చెబుతుంటారు. పుంగనూరు నియోజకవర్గంలో తరచూ పలువురు వ్యాపారుల్ని బెదిరిస్తూ.. వారి నుంచి పెద్ద ఎత్తున డబ్బులు తీసుకుంటారన్న ఆరోపణలు ఉన్నాయి.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు సైకిల్ యాత్ర చేసుకుంటూ వెళుతున్న వేళ.. వారిని అడ్డుకొని.. పెద్దిరెడ్డి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరకూడదని వార్నింగ్ ఇస్తూ.. సైకిల్ కు ఉన్న పార్టీ జెండాను తొలగించటమే కాదు.. వారు ధరించిన పసుపు చొక్కాను సైతం విప్పించి.. పంపించిన వైనం పెను సంచలనంగా మారటం తెలిసిందే. ఈ పని చేసిందెవరు? అన్న అరా పెరిగింది. ఇలాంటి వేళ.. చెంగలాపురం సూరి పేరు బయటకు రావటమే కాదు.. ఈ సందర్భంగా అతగాడి లీలలు ఏ స్థాయిలో ఉంటాయన్న విషయంపై మరింత స్పష్టత వచ్చింది.
This post was last modified on October 23, 2023 11:35 am
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…